మైనారిటీ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించిన హోం శాఖ మంత్రి

నవతెలంగాణ- కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలో శనివారం పండగ వాతావరణం నెలకొంది రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మైనార్టీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో రూ. 6.70 కోట్లతో ఈ గురుకుల పాఠశాల నిర్మించామని,2014 లో తెలంగాణ రాష్ట్రంలో నాడు 230 గురుకులాలు ఉంటే నేడు 1016 కు చేరాయని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 7 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉండగా నేడు  వాటి సంఖ్య 204 పెరిగిందని ,మొత్తం లక్షా నలబై వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్ధిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తుందని,స్థోమత కలిగిన వారు తమ పిల్లలను కార్పోరేట్ స్కూల్ లో చదివిస్తారని, పేదింటి పిల్లలకు ఆ స్థాయిలో విద్య అందించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని,గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పిల్లలని, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల బాధ్యత ప్రభుత్వ బాధ్యత, మనందరి భాద్యతని,గురుకుల పాఠశాలలలో చదివినవిద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో ప్రతిభను చూపిస్తున్నారని,ఇంటర్ చదివిన విద్యార్థులు డిగ్రీ కూడా ఇక్కడే చదవడానికి వీలుగా బాన్సువాడ కు ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు అయిందని,విద్యార్థులకు చదువే ఆస్థి, ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని,బాన్సువాడ లో కట్టించిన వెయ్యి డబుల్ బెడ్ రూం ఇళ్ళలో 430 ఇళ్ళను ముస్లిం మైనారిటీ లకు కెటాయించామని,స్థానిక శాసనసభ్యుడుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేయడం నా బాధ్యతగా పేర్కొన్నారు, దేవుని దయ, కేసీఆర్ గారి సహాయంతో బాన్సువాడ నియోజకవర్గానికి కావలసిన నిధులు వస్తున్నాయని, పేద మైనారిటీ ఆడబిడ్డల పెళ్ళికి షాదీముబారక్ ద్వారా నగదు సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్ అలీమాట్లాడుతూ గంగా జమున తెహజీబ్ లాగా అందరూ కలిసి ఉండాలని, అందరూ మంచి మనస్సుతో పనిచేయాలని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా అన్ని వర్గాలను సమానంగా చూస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని,నూతన సచివాలయంలో దేవాలయం, మజీద్, చర్చీ లను నిర్మించి సమైక్యత భావం నెలకొల్పారని పేర్కొన్నారు మైనారిటీల అభివృద్ధికి ఎనలేని కృషి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల జరిగిందని దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీలకు అన్ని రకాలుగా అండగా నిలబడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్రంలో బాన్స్వాడ అభివృద్ధి ఒక రోల్ మోడల్ గా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైనారిటీ కమీషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్, ఉర్ధూ ఆకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు  దఫేదార్ శోభా రాజు, జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, బోదన్ RDO రాజా గౌడ్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ షఫీఉల్లా, పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ సునీత శ్రీనివాసరావు, జెెడ్పీటీసీ శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హైమద్, నాయకులు జుబేర్, సలీం, బాబు ఖాన్, గౌస్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్దు, రైతు కన్వీనర్ కొల్లూరు కిషోర్ బాబు , బర్ల మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love