ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాజేందర్ రెడ్డికి సన్మానం

నవతెలంగాణ- కంటేశ్వర్
బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసీ మెంబర్ గా ఎన్నికైన మంథని రాజేందర్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్, రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రాజేందర్ రెడ్డి బాస్కెట్బాల్ ఫెడరేషన్ లో సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శి గంగా మోహన్ పాల్గొన్నారు.
Spread the love