బిఎల్ఓ సర్వేల నుండి ఆశ వర్కర్లకు మినయించాలి

– బిఎల్ఓ డ్యూటీలు చేయకుంటే మెమోలు ఇస్తామని బెదిరింపుల ?

– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
బిటేఎల్ఓ సర్వేల నుండి ఆశ వర్కర్లకు మినహాయించాలని బిఎల్ఓ డ్యూటీలు చేయకుంటే మెమోలు ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం  కలెక్టర్ కార్యాలయం వద్ద బిఎల్ఓ డ్యూటీలు చేయమని ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఓ ప్రశాంత్ రెడ్డి కి, డిఎంహెచ్ఓ కార్యాలయం లో ఏవో గంగాధర్  కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఆశా వర్కర్లను బిఎల్ఓ డ్యూటీలు చేయాలని. బెదిరింపులకు పాలు పడుతున్నారు. బిఎల్ఓ డ్యూటీలు చేయకుంటే మెమొలు జారీ చేస్తామని బెదిరియ్యడం ఇది సరికాదని అన్నారు. డిఎల్ఓ డ్యూటీ లో ఉన్నప్పుడు ఆశా వర్కర్లకు డెలివరీ కేసులు సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డ్స్, రివార్డ్ పొందుతున్నారు. కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మహిళ సైనికులు ఆశా కార్యకర్తలు.కంటి వెలుగు,లెప్రసీ,మలేరియా, టిబి గుర్తింపు కార్యక్రమంలో అత్యున్నత పాత్ర వహించారు. కానీ వారికి బిల్లులు మంజూరు చెయ్యలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది.మనసున మహారాజుకి చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా కడుపులు ఎండబెట్టడం ఎలాంటి మనస్సూ గుర్తించాలని కోరారు.దొర అహంకారం అనేది నిలువునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సుకన్య లలిత రాధా రేణుక స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love