తెలుసుకోవడం ఎలా..?

How to know..?ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి లోనవుతు న్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాక పోగా ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే చాలా మంది పెద్దవాళ్లు మాత్రమే ఒత్తిడికి లోనవుతారని అనుకుం టారు. కానీ ఇది పొరపాటు, పిల్లలు సైతం ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధ నలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో తల్లి దండ్రులే పిల్లలకు సరైన పరిష్కార మార్గం చూపించగలుగుతారు. అయితే పిల్లలు ఒత్తిడికి గురవుతున్నట్టు ఎలా తెలుసుకోవాలో చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు. అలాంటి వారి కోసం నిపుణులు కొన్ని సల హాలు ఇస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి లోనైన ప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని వారు చెబుతున్నారు. అవి ఏంటో? చిన్నారు లను ఒత్తిడి నుంచి ఎలా బయట పడేయాలో తెలుసుకుందాం రండి…

కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే ఇవి సాధా రణంగా కూడా వస్తుంటాయి. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తుంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలి. టీచర్లు ఇచ్చిన హౌమ్‌ వర్క్‌ చేయలేక పోవడం, పరీక్షలకు సరిగా సన్నద్ధం కాకపోవడం వంటి వాటి వల్ల కూడా పిల్లలు
ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారోననే భయం కూడా వారిలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పిల్లలను మీరే దగ్గరకు తీసుకొని అసలు సమస్యేంటో నెమ్మదిగా అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెబుతూ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.
ఫోన్‌ ఎక్కువగా వాడుతుంటే
సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడడా నికి అసక్తి చూపుతుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ కొన్ని మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నామన్న విషయం కూడా వారికి తెలియదట. అలా అని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదు. ఒకవేళ వారికి ఫోన్‌ ఇచ్చినా దానికంటూ కొంత సమయం కేటాయించండి. అలాగే వారు ఆడే ఆటలు, చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం ఎంతైనా అవసరం.
తినే విధానం…
మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతు న్నామో లేదో తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా వర్తిస్తుంది. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ, తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుంటే దానిని ఒత్తిడి కిందే పరిగ ణించాలి. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా చేస్తుండచ్చు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయండి. దాంతో వారిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.
ఏకాగ్రత తగ్గుతోందా?
ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఏ పనీ సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువు విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుం ది. అయితే ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాలపైనే ఆధా రపడి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను సరి గా నిర్వర్తించనప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకుం టారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతే కొన్నిసార్లు ఒత్తిడి కి లోనవుతుంటారు. అలాంటప్పుడు వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్ని ఒత్తిడి నుంచి బయటపడేయచ్చు.
తరచుగా వస్తుంటే…
కొంతమంది వారికి వచ్చిన సమస్యను పెద్దదిగా చూసు కొని తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో ఏదైనా మాట్లాడు తున్నప్పుడు మౌనంగా ఉండడం లేదా మధ్యలోనే వెళ్లిపోవడం వంటివి చేస్తుంటారు. పిల్లలు కూడా ఇలా చేసే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు రాత్రుళ్లు పక్క తడుపుతుంటారు. చిన్న పిల్లల్లో అయితే ఇది పెద్ద సమస్య కాదు.. కానీ స్కూలుకి వెళ్లే వయసున్న వారు కూడా ఇలా చేస్తుంటే వాళ్లు ఒత్తిడి చెందుతున్నారని భావించాల్సిందే. కొంతమంది పిల్లలకు పీడ కలలు వస్తుంటాయి. అయితే అవి ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచుగా వస్తుంటే అది ఒత్తిడి సమస్యేనని భావించాలి. మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. వారి సమస్యను తెలుసు కునే ప్రయత్నం చేయండి. వారికి కావాల్సిన సహాయం చేసి చూడండి. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నిపుణులను సంప్రదించే ప్రయత్నం చేయండి.

Spread the love