భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

నవతెలంగాణ -ఢీల్లి: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి.  ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.7 చొప్పున పెంచారు. తాజా పెంపు తర్వాత న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,773 నుండి రూ.1,780కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,902కు, ముంబైలో రూ.1,740, చెన్నైలో రూ.1,952కి పెరిగాయి. ఓ వైపు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ, తగ్గుతూ ఉండగా, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. చివరిసారి మార్చి 1, 2023న రూ.50 పెరిగింది.

Spread the love