కొత్త బీజేపీ అధ్యక్షులు వీరే.. ఈటలకు కీలక పదవి

నవతెలంగాణ – ఢీల్లి: త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ మార్పులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని బీజేపీ జాతీయ అరుణ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే, ఝార్ఖండ్‌ పార్టీ చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్‌ మారండి, పంజాబ్‌ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సునీల్ జాఖర్‌ను నియమించింది.

Spread the love