ఒత్తిడిలో రెజ్లర్లు..

– రాజీ కోసం బెదిరింపులు
– లేదంటే 40 లోక్‌సభ, 160 అసెంబ్లీ స్థానాలలో బీజేపీకి షాక్‌..

లోక్‌సభ ఎన్నికల్లో జాట్‌ ఓట్ల కోసం ముందుచూపు
లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్న మహిళా మల్లయోధులపై రాజీ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లలో జాట్‌ కులానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. జాట్ల ప్రాబల్యం కేవలం హర్యానాకే పరిమితం కాదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌తో పాటు ఢిల్లీలో కొంతమేర వీరు నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ : ఈ నాలుగు రాష్ట్రాలలోని 40 లోక్‌సభ స్థానాలలో, వాటి పరిధిలోని 160 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల జయాపజయాలను తారుమారు చేసే బలం వీరి సొంతం. కర్నాటక ఓటమితో దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా పట్టు కోల్పోయిన బీజేపీ, ఉత్తరాదిలోనూ వ్యతిరేకతను మూటకట్టుకుంటోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించాలంటే తక్షణమే రెజ్లర్లను భయపెట్టో లేక బతిమాలో దారికి తెచ్చుకోవడం మినహా మరో మార్గం లేదని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే రాజీ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలోనే నిరసన విరమించాలని, రాజీ చేసుకోవాలని రెజ్లర్లకు బెదిరింపులు వస్తున్నాయి. బ్రిజ్‌ భూషణ్‌పై తొలుత ఆరోపణలు చేసిన మైనర్‌ రెజ్లర్‌ ఆ తర్వాత మాట మార్చడానికి ఈ ఒత్తిడే కారణమని ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ తెలిపారు. రాజీ చేసుకోవాల్సిందిగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోందని ఆమె ఓ టెలివిజన్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సిందిగా మైనర్‌ రెజ్లర్‌ తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆయన మానసిక ఒత్తిడికి లోనయ్యారని సాక్షి మాలిక్‌ తెలిపారు. సమస్యను పూర్తిగా పరిష్కరించని పక్షంలో ఆసియా క్రీడలలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. హర్యానాలోని సోనేపట్‌లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రెజ్లర్లు రోజురోజుకూ మానసికంగా ఎంతగా కుంగిపోతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోయారు. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించడానికి రెజ్లర్లు ఏర్పాటు చేసిన మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు ఆమె సోనేపట్‌ వచ్చారు. ఆసియా క్రీడల కోసం ఈ నెలలో ట్రయల్స్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో సాక్షి మాలిక్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు ఆందోళన విరమించి, ఈ ట్రయల్స్‌కు హాజరై ఆసియా క్రీడల జట్టులో స్థానం సంపాదించాల్సి ఉంటుంది. చైనాలో సెప్టెంబర్‌ 23 నుండి అక్టోబర్‌ 8 వరకూ ఆసియా క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ పూర్తి కావడానికి ఈ నెల 15 వరకూ సమయం ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తమను కోరినట్లు రెజ్లర్లు నాలుగు రోజుల క్రితం తెలిపారు.
బీజేపీ అవకాశాలపై ప్రభావం
రెజ్లర్లలో ఎక్కువ మంది జాట్‌ కులానికి చెందిన వారు ఉండడంతో వారి ప్రభావం నాలుగు రాష్ట్రాలపై ఉండబోతోంది. జాట్ల మద్దతుతోనే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితి మారుతోంది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్‌ఎల్‌డీ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఇవన్నీ జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాలే. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలోనూ జాట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఆర్‌ఎల్‌డీ, దాని మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది. మరోవైపు ఆయా ప్రాంతాలలో బీజేపీ చతికిలపడింది. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఆ పార్టీ 20 నగరపాలిక ఛైర్మన్‌ స్థానాలను (మొత్తం 56 స్థానాలు), 34 నగర పంచాయత్‌ ఛైర్మన్‌ స్థానాలను (మొత్తం 124 స్థానాలు) మాత్రమే పొందగలిగింది. పశ్చిమ యూపీలోని 12 లోక్‌సభ స్థానాలు, 40 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి జాట్లకు ఉంది.
మొత్తంగా చూస్తే యూపీ, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ రాష్ట్రాలలోని 40 లోక్‌సభ స్థానాలు, 160 అసెంబ్లీ స్థానాలలో జాట్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యూపీలో 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జాట్ల ఓట్లు పార్టీలవారీగా చీలిపోయాయి. బీజేపీ తరఫున 10 మంది జాట్‌ ఎమ్మెల్యేలు విజయం సాధించగా ఆర్‌ఎల్‌డీ నుండి నలుగురు, సమాజ్‌వాదీ పార్టీ నుండి ముగ్గురు జాట్‌ ఎమ్మెల్యేలు గెలుపొందారు.
 రెజ్లర్లకు నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆధారాలు ఇవ్వండి

రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌పై కేసును నమోదు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు. సింగ్‌ పై లైంగిక ఆరోపణలు చేస్తూ కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఆర్పీసీ సెక్షన్‌ 91 ఆధారాలు ఇవ్వండి
ప్రకారం ఆరోపణలు చేసినదాని ప్రకారం వీడియోలు, ఆడియోలు, వాట్సాప్‌ చాటింగ్‌లు, ఫోటోలు, బెదిరింపు సందేశాలు వంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే స్టేషన్‌లో పొందుపరచాలని కోరింది.
ఏప్రిల్‌ 21న భారత మహిళా రెజ్లర్లు ఇద్దరు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారని, ఊపిరి చెక్‌ చేస్తానంటూ ఇష్టానుసారంగా మీద చేతులు వేస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా కన్నాట్‌ ప్లేస్‌ పోలీసులు ఫిర్యాదులో వారు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడికి సంబంధించిన వివరాలు ఉంటే తమకివ్వాలంటూ సీిఆర్పీసీ సెక్షన్‌ 91 చేతులు వేసినట్టుగా కానీ, తమను ముట్టుకుంటున్నట్టుగా కానీ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్‌ సందేశాలు ఏమైనా తమకి ఇవ్వాలంటూ సిఆర్పీసి సెక్షన్‌ 91 ప్రకారం ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సంతకాలు చేసిన నోటీసులను పంపించారు.

Spread the love