‘కృతిశెట్టిని నా జోడీగా భావించలేను’

నవతెలంగాణ – హైదరాబాద్: హీరో విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హీరోయిన్‌ కృతిశెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో సినిమాలను తిరస్కరించడానికి గల కారణాన్ని వివరించారు. ‘నేను నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయలేనని చెప్పా. దానికి కారణం ‘ఉప్పెన’లో ఆమెకు తండ్రిగా నటించాను. అది మంచి విజయాన్ని సాధించింది. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేను. అందుకే వద్దు అని చిత్రబృందానికి చెప్పాను. ‘ఉప్పెన’లో కొన్ని క్లైమాక్స్‌ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి కంగారు పడింది. ‘నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు’ అని ధైర్యం చెప్పాను. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’ అని వివరించారు. ‘ఉప్పెన’ తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా విజయ్ సేతుపతి తిరస్కరించారు.

Spread the love