కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

– రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి..
– వేములవాడలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ..
నవతెలంగాణ – వేములవాడ
ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే, రైతులను మోసం చేస్తే  పీడి యాక్ట్  నమోదు చేస్తామని  హెచ్చరించారు.జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్  అనురాగ్ జయంతి సంబంధిత విత్తన, ఎరువుల దుకాణ దారులు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో  గల మన గ్రోమోర్ సెంటర్, శ్రీ లక్ష్మి ఎరువుల విత్తనాలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విక్రయాల నిర్వహణను, రిజిస్టర్ లను ,స్టాక్ వివరాలు కలెక్టర్ పరిశీలించారు. వానాకాలం 2024  పంటలకు జిల్లాలో అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే స్టాక్ పెట్టుకుని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నదని, మన జిల్లాలో సైతం ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అవసరమైన మేర ఎరువుల నిలువలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకూడదనీ, అమ్మినచో కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఓ సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.
Spread the love