
ఆదివాసి నాయక్ పోడు పై లేనిపోని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, ఆదివాసి నాయక్కోడి సంగం జోలికొస్తే ఖబర్దార్ అని, మీడియా ముసుగులో తమను వ్యక్తుల బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆదివాసి నాయక్ పోడు అధ్యక్షులు గాండ్ల రామచందర్ ఆరోపించారు. లేని పోనీ అవాస్తవాలు సృష్టిస్తూ ఓ వ్యక్తి తమను కించపరిచే విధంగా వార్తలు రాస్తామంటూ బెదిరింపులు దిగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం నాయకులు జిల్లా కలెక్టరేట్ కు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్లో ఏవో కు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్ మాట్లాడుతూ ఇటీవల కుల సంఘ పెద్దల సమక్షంలో మండల అధ్యక్షులు ఎన్నికలు చెప్పుకున్నామని ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా అధ్యక్షునిగా తనను ఎన్నుకో వడం జరిగిందని అన్నారు. అయితే ఇది నచ్చని కొంతమంది సంఘ కట్టుబాట్లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరంగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న అని చిన్న కారణంతో తనను వ్యక్తిగతంగా మానసికంగా భయభ్రాంతులకు గురి చేస్తూ తమ కుల సంఘ సభ్యులపై ఇష్టం వచ్చిన విధంగా ఓ వ్యక్తి తనను అగౌరవపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని దీని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారిపై జిల్లా ఉన్నతాధికారులు కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలాంటి సాక్షాదారులు లేకుండా నాపై, సంఘంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న వ్యక్తిపై విచారణ చేసి చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.