అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న పట్టించుకోని అధికారులు

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించగా బిజెపి నాయకులు వాక్ అవుట్ చేసినారు ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకు… అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నందుకు ప్రభుత్వ స్థలంలో అక్రమ లేఔట్లు మాటు కాలువలను అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించినందుకు మున్సిపాలిటీ నీ రియల్ ఎస్టేట్ గా మార్చి 40 శాతం కమిషన్ల కొరకు దోపిడీ చేస్తూ ఈ విషయాలను ప్రశ్నించినందుకు తమకు కౌన్సిలర్లకు అభివృద్ధి నిధులలో 5 లక్షలు టిఆర్ఎస్ కౌన్సిలర్లకు 10 లక్షల కేటాయించుకొని వివక్షకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే వారు మెజారిటీగా ఉన్నారని కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒకటి నుండి 69 అంశాలను (కేవలం 2 నిమిషాల్లో) ఆమోదించామని కమిషనర్ తెలుపగా బిజెపి కౌన్సిలర్లు సమావేశాన్ని వకౌట్ చేస్తూ బయటికి రావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి 15వ ఆర్థిక సంఘం మరియు పట్టణ ప్రగతిలో ఉండగా బీజేపీ కౌన్సిలర్లకు నిధులను కేటాయించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే జిల్లా కలెక్టర్ స్పందించి ఇట్టి తీర్మానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ ఎజెండాలో మొక్కల పేరు మీద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు ట్యాంకర్ల పేరు మీద జెసిబిలను ఎంగేజ్ చేశామని వాటిమీద లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ 20 లక్షల తో ఏర్పాటు చేస్తే అవి పనిచేయకపోవడం లేదని బిజెపి ఆందోళన చేస్తే రెండు లక్షల 30 వేల రూపాయలు మళ్లీ కేటాయించి రిపేరు చేయడం జరిగింది సిగ్నల్స్ ఎప్పుడు కూడా పని చేసిన పాపాన పోలేదు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఒక నిరంకుశ వైఖరితో బిజెపి కౌన్సిలర్లకు నిధులను కేటాయించకపోవడం రాక్షసానందం పొందడం దారుణం అని అన్నారు పదవ వార్డు కౌన్సిలర్ కొంతం మంజుల మురళీధర్ మాట్లాడుతూ దళితులపై ఈ వివక్ష ఏంటి అని ప్రశ్నిస్తూ అభివృద్ధి నిధులలో మా వార్డ్కి తక్కువ కేటాయించడం ఏంటని ప్రశ్నించగా ఇది సబబు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులపై సీత కన్ను చూపిస్తుందనడానికి ఇదే ఆదర్శం అని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాగే వ్యవహరిస్తే మా వార్డు ప్రజలతో పన్నులను చెల్లించకుండా మున్సిపాలిటీనీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఇట్టి సమావేశంలో కౌన్సిలర్స్ బ్యవత్ సాయికుమార్, పాలెపు లతా రాజు కొంత మురళీధర్ పాల్గొన్నారు.

Spread the love