ట్రాన్ఫార్మర్ దొంగలకు జైలు శిక్ష..

నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో 2022 సంవత్సరంలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడిన పల్లిపాటి ఏసుదాసు గ్రామం సింగరాయ కొండ, ఒంగోలు జిల్లా,నర్రా శ్రీధర్ గ్రామం షాలిపేట్, చిన్న శంకరం పేట్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఏర్గట్ల ఎస్సై రాజు అరెస్ట్ చేసి వారి ఇరువురి నుండి ఐదు ట్రాన్స్ఫార్మర్ల కేసులకు సంబంధించి,160 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకుని,దర్యాప్తు అనంతరం,వారిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆర్మూర్ కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు మేజిస్ట్రేట్ దీప్తి ఇరువురికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు ఏర్గట్ల ఎస్సై రాజు తెలిపారు. ఇందులో ప్రభుత్వ తరపు న్యాయవ్యాధి పి.రాజేశ్వరి, కోర్ట్ కానిస్టేబుల్ ప్రవీణ్ పాల్గొన్నారు. నిందితులకు జైలు శిక్ష పడే విధంగా సరియైన సాక్షులను కోర్టులో హాజరు పరిచినందుకు ప్రవీణ్ ను ఎస్సై రాజు, సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు.

Spread the love