న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మానాన్ని ముందు ఏ సభలో ప్రవేశ పెట్టాలి?

1. అయోధ్యలోని వివాదాస్పద భూమి రాంలల్లా విరాజ్మాన్‌కే చెందుతుందని ఎంతమందితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
1. 6 2. 10 3. 4 4. 5
2. పిల్‌ అనే భావన భారతదేశంలో ప్రాచుర్యాన్ని కల్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు?
1. పి యన్‌ భగవతి 2. వైవి చంద్రచుడ్‌
3. వి.ఆర్‌. కృష్ణ అయ్యర్‌ 4. పై అందరూ
3. 49వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1. ఎన్‌ వి రమణ 2. డి.వై. చంద్రచుడ్‌
3. యూ యూ లలిత్‌ 4. వై వి చంద్రచుడ్‌
4. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేయని మహిళలు?
1. భానుమతి 2. రూమపాల్‌
3. హిమకోహ్లీ 4. రమాదేవి
5. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం కల్పించాలని పేర్కొన్నవారు?
1. కె యం మున్సి 2. అంబేద్కర్‌
3. కె టీ షా 4. బాబు రాజేంద్రప్రసాద్‌
6. అమెరికా సుప్రీంకోర్టు ఏ కేస్‌ లో మొదటిసారిగా ”న్యాయసమీక్ష” అనే భావనకు పునాదులు వేసింది.
1. సజ్జన్‌ సింగ్‌ Vర రాజస్థాన్‌
2. మార్బురి Vర మడిసిన్‌
3. కామన్‌ కాస్‌ కేస్‌ 4. ఏదీకాదు
7. శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే దానిని ఈక్రింది విధంగా పేర్కొంటారు?
1. అమికస్‌ క్యూరి 2. అల్ట్రా వైర్స్‌
3. ఇంట్రా వైర్స్‌ 4. ఎక్ట్రా వైర్స్‌
8. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొదటిసారిగా న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం తొలగించబడింది.
1. 25వ రాజ్యాంగ సవరణ
2. 43వ రాజ్యాంగ సవరణ
3. 42వ రాజ్యాంగ సవరణ
4. 44వ రాజ్యాంగ సవరణ
9. భారతదేశంలో న్యాయవ్యవస్థ పితామహుడిగా ఎవరిని అంటారు?
1. కారన్‌ వాలిస్‌ 2. విలియం బెంటింగ్‌
3. లార్డ్‌ మెకాలే 4. లార్డ్‌ మిటో
10. రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం ఏర్పడిన తొలి సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు.
ఎ. హెచ్‌ జె కానియా బి. ఛాంబర్లీన్‌
సి. లేమియోస్టార్‌ డి. హైడ్‌
1. ఎ, డి, సి 2. బి, సి, డి
3. ఎ, బి, సి 4. ఎ, బి, సి, డి
11. ఫెడరల్‌ కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి.
1. సర్‌ ఎలిజ ఇంఫె 2. మౌరిస్‌ గ్వయర్‌
3. పాట్రిక్‌ స్పెన్స్‌ 4. హెచ్‌ జె కానియా
12. ఫెడరల్‌ కోర్టు స్థానంలో ప్రస్తుత సుప్రీం కోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది?
1. 1947 2. 1935
3. 1950 4. 1952
13. న్యాయవాదిగా పనిచేసి నేరుగా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి అయిన రెండవ తెలుగు వారు?
1. లావు నాగేశ్వరరావు 2. ఎన్‌ వి రమణ
3. కొక సుబ్బారావు 4. పీ యెస్‌ నరసింహ
14. 127వ నిబంధన ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులు గరిష్టంగా ఎంతకాలం పదవిలో వుంటారు?
1. 3 సంవత్సరాలు 2. 1 సంవత్సరం
3. 4 సంవత్సరాలు 4. 2 సంవత్సరాలు
15. న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే ఎంత మంది సభ్యుల మద్దతు ఉండాలి.
1. 10 2. 50 3. 100 4. 25
16. న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని సభ అధ్యక్షులు ఆమోదించి విచారణ కమిటీకి ఆదేశిస్తారు. ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు?
1. 5 2. 3 3. 4 4. 6
17. క్రింది వాటిలో సరైనది/ సరైనవి గుర్తించండి.
1. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి సంరక్షణ కర్తగా పనిచేస్తుంది.
2. ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు సంరక్షిస్తుంది.
3. ఎ మరియు బి 4. పై ఏదీకాదు
18. సుప్రీంకోర్టు అధికార పరిధి విస్తరింపజేసే అధికారం..
1. రాష్ట్రపతి 2. రాజ్యసభ
3. పార్లమెంట్‌ 4. కొలీజియం
19. కోర్టు తనకు తాను స్వతహాగా కేసులను విచారించడాన్ని ఏమని అంటారు.
1. అమికస్‌ క్యూరి 2. కోర్టు ఆఫ్‌ రికార్డ్‌
3. పిల్‌ 4. సుమోటో కేస్‌
20. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు.
1. జెనివా 2. వాషింగ్టన్‌
3. రోమ్‌ 4. దిహెగ్‌
21. కేరళ రాష్ట్ర మంత్రిగా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియామకం అయిన ఏకైక వ్యక్తి ఎవరు?
1. సుభాష్‌ రెడ్డి 2. వి. ఆర్‌. కృష్ణ అయ్యర్‌
3. కె.జి. బాలకృష్ణన్‌ 4. భగవతి
22. సుప్రీంకోర్టుకు తపాలా శాఖ ప్రత్యేక పిన్‌కోడ్‌ ను ఏ సంవత్సరం కేటాయించింది?
1. 2013 2. 2015
3. 2005 4. 2021
23. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియామకం అయిన జె కె మహేశ్వరి ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు?
1. ఆంధ్రప్రదేశ్‌ 2. తెలంగాణ
3. గుజరాత్‌ 4. కర్ణాటక
24. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియామకం అయిన హిమకోహ్లీ ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
1. సిక్కిం 2. తెలంగాణ
3. గుజరాత్‌ 4. కర్ణాటక
25. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకు నియామకం అయిన తొమ్మిది మంది న్యాయమూర్తులలో ఎంతమందికి 2027లో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కలదు.
1. 1 2. 2 3. 3 4. 4
26. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ప్రధాన న్యాయ మూర్తులుగా పనిచేసిన తెలుగువారు?
1. 1 2. 3 3. 4 4. 2
27. డివై చంద్రచూడ్‌ సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి?
1. 50 2. 49 3. 48 4. 47
28. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ తరువాత రాష్ట్రపతిగా పోటీచేసి ఓడిపోయిన వారు?
1. కోక సుబ్బారావు 2. హిదయతుల్లా
3. గజేంద్ర గడ్కర్‌ 4. ఎస్‌ఎమ్‌ సిక్రీ
29. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ తెలుగువారు ఎవరు?
1. లావు నాగేశ్వరరావు 2. కొక సుబ్బారావు
3. సుభాష్‌ రెడ్డి 4. యన్‌ వి రమణ
30. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
1. రాజ్యాంగ సవరణలను విచారించే అధికారం హైకోర్టుకు లేదు
2. రాజ్యాంగ సవరణలకు విచారించే అధికారం సుప్రీంకోర్టుకు కలదు
3. 1 మరియు 2 4. ఏదీ కాదు
31. హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టు అప్పీళ్ళను విచా రించే అధికారం కలదు. అయితే హైకోర్టు అనుమతి అవసరం ఒకవేళ హైకోర్టు అనుమతి నిరాకరిస్తే ఏ నిబంధన ప్రకారం ప్రత్యేక అనుమతి వివాదాల రూపం లో అప్పీళ్ళను స్వీకరిస్తుంది.
1. 131 2. 142 3. 136 4. 222
32. భారత రాజ్యాంగంలో 132వ నిబంధన దేనిని తెలియజేస్తుంది.
1. రాజ్యాంగ పరమైన వివాదాలు
2. క్రిమినల్‌ వివాదాలు
3. సివిల్‌ వివాదాలు 4. పైవన్నీ
33. ఇప్పటి వరకు అభిశంసన తీర్మానం ద్వారా ఎంతమంది న్యాయమూర్తులు తొలగించబడ్డారు?
1. 2 2.1 3. 3 4. తొలగించబడలేదు
34. న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశ పెట్టాలంటే ఎంతమంది సభ్యుల మద్దతు ఉండాలి.
1. 50 2. 100 3. 10 4. 20
35. 121వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు?
1. 31.12.2014 2. 13.4.2015
3. 8.12.2014 4. 10.13.2014
36. న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. మొదటి జడ్జెస్‌ కేసు 2. రెండవ జడ్జెస్‌ కేసు
3. మూడవ జడ్జెస్‌ కేసు 4. ఏదీకాదు
37. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌లో ఎంత మంది ఉండేవారు?
1. 4 2. 6 3. 8 4. 10
38. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది.
1. 13.4.2015 2. 8.12.2014
3.10.13.2014 4. 31.12.2015
39. న్యాయమూర్తుల సంఖ్యను చివరిసారిగా 31 నుండి 34 కు ఏ సంవత్సరంలో పెంచారు?
1. 2021 2. 2019
3. 2009 4. 2018
40. న్యాయవాదిగా పనిచేసి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఐన తొలివారు?
1. కులదీప్‌సింగ్‌ 2. సంతోష్‌ హెగ్డే
3. యస్‌ యమ్‌ సిక్రీ 4. ఎవరు కాదు
41. ఫెడరల్‌ కోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు?
1. యస్‌ వరదాచారి 2. మౌరిస్‌ గ్వయర్‌
3. లేమియోస్టార్‌ 4. పై ఎవరూ కాదు
42. ఫెడరల్‌ కోర్టు ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది?
1. 1726 2. 1935
3. 1937 4. 1950
43. ఫెడరల్‌ కోర్టు చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1. పాట్రిక్‌ స్పెన్స్‌ 2. వరదాచారి అయ్యర్‌
3. మౌరిస్‌ గ్వయర్‌ 4. హెచ్‌ జె కానియా
44. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించింది ఎవరు?
1. న్యాయశాఖ మంత్రి
2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3. రాష్ట్రపతి 4. ప్రధానమంత్రి
45. 2002లో రాజ్యాంగ పున:సమీక్ష కమిషన్‌ న్యాయ మూర్తుల పదవి విరమణ వయసు ఎంతకు పెంచాలని సిఫార్సు చేసింది.
1. 68 2. 70 3. 66 4. 67
46. క్రింది వాటిలో సరైంది గుర్తించండి.
1. ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల నెలసరి వేతనం 280000
2. పదవీకాలంలో వీరి జీతభత్యాలు తగ్గించరాదు
3. 1 మరియు 2 4. ఏదీకాదు
47. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీకాలం?
1. 9 సంవత్సరాలు 2. 10 సంవత్సరాలు
3. 5 సంవత్సరాలు 4. 6 సంవత్సరాలు
48. క్రింది వాటిలో న్యాయ సమీక్షకు అవకాశం లేని అంశాలను గుర్తించండి.
1. కేంద్రమంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం
2. రెండవ షెడ్యూల్‌లో పేర్కొన్న జీతభత్యాలు
3. పార్లమెంట్‌ కార్యక్రమాలు 4. పైవన్నీ
49. న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మానాన్ని ముందు ఏ సభలో ప్రవేశ పెట్టాలి?
1. లోక్‌సభ 2. రాజ్యసభ
3. లోక్‌సభ లేదా రాజ్యసభ 4. పై ఏదీకాదు
50. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ గారి నాన్నగారు అయిన వైవి చంద్రచూడ్‌ సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి?
1. 13వ 2. 14వ 3. 15వ 4. 16వ

సమాధానాలు
1.4 2.4 3.3 4.4 5.1
6.2 7.3 8.3 9.1 10.2
11.2 12.3 13.4 14.4 15.3
16.2 17.3 18.3 19.4 20.4
21.2 22.1 23.1 24.2 25.3
26.4 27.1 28.1 29.4 30.3
31.3 32.1 33.4 34.1 35.1
36.1 37.2 38.1 39.2 40.3
41.1 42.3 43.4 44.2 45.1
46.2 47.1 48.4 49.3 50.

– డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు 9494228002

Spread the love