కరెంట్‌ అఫైర్స్‌

కరెంట్‌ అఫైర్స్‌ఎక్స్‌ పోశాట్‌ విజయవంతం
2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ూూూV జ58 రాకేట్‌ను ప్రయోగించింది. ఎక్స్‌రే పొలారీ మీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌పో శాట్‌)ను ప్రయోగించింది ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారి మీటర్‌ మిషన్‌ కావడం విశేషం. 2021లో ×శూజు పేరిట ఈ తరహ ప్రయోగం అమెరికా నిర్వహించింది. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా ఘనత దక్కించుకొంది భారత్‌. కాంతి వంతమైన అంతరిక్ష ఎక్స్‌-రే కిరణాలు వాటి ప్రభావాన్ని ఎక్స్‌ పో శాట్‌ అధ్యయనం చేస్తుంది. ఇది ఐఎస్‌ఆర్‌ఓ కు 60వ ప్రయోగం.

వెంకటగిరి వస్త్రాలకు జాతీయ గుర్తింపు
రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న వెంకటగిరి వస్త్రాలకు 150 ఏళ్ళ చరిత్ర ఉంది. వెండి, జరీ, ఆఫ్‌ ఫైన్‌ జరీలను అమర్చి ప్రత్యేక శైలిలో చీరలు నేయడం ద్వారా ఇక్కడి చేనేత పరిశ్రమ జాతీయ స్థాయిలో ప్రసిద్ది పొందింది. వెంకటగిరి చీరలును 17వ శతాబ్దంలో నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజ వంశీయులు ధరించేవారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఇన్వెస్ట్‌ ఇండియా కమిటి పర్యవేక్షణ చేతి వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యత సాధించడంలో పాట గుర్తింపు పొందిన రంగాలకు ఈ ఏడాది నుంచి జాతీయ స్థాయి అవార్డులను ప్రధానం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన రాష్ట్రం నుంచి 12 రంగాలను ఎంపిక చేశారు. అందులో ముందు వరుసలు వెంకటగిరి చేనేత పరిశ్రమను జాతీయ అవార్డు పోటీలకు ఎంపిక చేశారు.

అమెరికాలో కలకలం రేపుతున్న జాంబీ డీర్‌
అమెరికాలో ‘జాంబీ డీర్‌’ వ్యాది కలకలం రేపుతుంది. ఎల్లో స్టోన్‌ నేషనల్‌ పార్క్‌లో జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా జింకలు, లేళ్లు, దుప్పి వంటి జంతువులలో ప్రభలంగా వున్నట్టు గుర్తించారు. దీని కారణంగా జంతువులు బరువును కొల్లాయి, తూలిపోతూ నడుస్తాడు. నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీసే ఈ వ్యాది మానవులకు సక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆవుపేడతో నడిచే రాకెట్‌ను తయారు చేసిన జపాన్‌
జపానీస్‌ స్పేస్‌ స్టార్టప్‌ ఇంటర్‌ స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ సంస్థ హక్కైడో స్పేస్‌ పోర్ట్‌ ద్వారా ఆవు పేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించారు. ఆవుపేడ నుంచి తయారయ్యే బయోమీధేన్‌ వాయువును ఈ రాకెట్‌ ఇంధనంగా ఉపయోగించుకొంటుంది. బయోమీధేన్‌ వాయువును ఉపయోగించడం అంతరిక్ష పరిశోధనా రంగంలో కీలక మలుపు కానుంది. బయోమీధెన్‌తో తక్కువ ఖర్చుతో రాకెట్‌ ప్రయోగాలు పూర్తి కానున్నాయి.

జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ విషయంపై జపాన్‌ ప్రధాని పుమియో కిషిడా తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. జపాన్‌లో ఈ భారీ భూకంపం సోమవారం నుంచి 155 సార్లు భూమి కంపించింది. పలు భవనాలు కుప్ప కూలి పోయాయి. రోడ్లు పగుళ్లు కన్పించాయి. రిక్టర్‌ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. అధికారికంగా 8 మంది మరణించినట్టు ప్రకటించారు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love