అతి తక్కువ కాలం అమలులో వున్న చార్టర్‌ చట్టం?

Shortest Charter Act?1. క్యాబినేట్‌ మిషన్‌లోని సభ్యులను గుర్తించండి.
ఎ. ఎ.వి. అలెగ్జాండర్‌ బి. క్లెమెంట్‌ అట్లీ
సి. సర్‌ స్టాపర్డ్‌ క్రిప్స్‌ డి. లార్డ్‌పెథిక్‌ లారెన్స్‌
1. ఎ,బి 2. ఎ,బి,డి
3. ఎ,సి,డి 4. ఎ,బి,సి,డి
2. భారత ప్రభుత్వ చట్టం 1935 గట్టి బ్రేకులు ఉండి ఇంజన్‌ లేని యంత్రం వంటిది అని విమర్శించినది ఎవరు?
1. సుభాష్‌ చంద్రబోస్‌ 2. అంబేద్కర్‌
3. జిన్నా 4. నెహ్రూ
3. క్రిప్స్‌ ప్రతిపాదనలను ఒక దివాల తీసే బ్యాంకు ముందు తారీఖు వేసి అందించే చెక్కుల లాంటివి అని పేర్కొన్నవారు ఎవరు?
1. అంబేద్కర్‌ 2. జిన్నా
3. గాంధీ 4. సర్ధార్‌ వల్లభారుపటేల్‌
4. క్రింది వాటిలో సరైన వాక్యం / వాక్యాలు గుర్తించండి.
ఎ. మౌంట్‌ బాటన్‌ విభజన ప్రణాళిక 3 జూన్‌ 1947.
బి. భారత స్వాతంత్య్ర బిల్లు 1947 బ్రిటిషు పార్లమెంటు ఆమోదం 4 జులై 1947.
1. బి మాత్రమే 2. ఎ,బి
3. ఎ మాత్రమే 4. ఏది కాదు.
5. 1774సం.లో కలకత్తాలోని పోర్టు విలియం లో మేయర్‌ కోర్టు స్థానంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. కాగా మేయరు కోర్టు ఏ సం.లో స్థాపించారు?
1. 1729 2. 1886
3. 1726 4. 1774
6.క్రింది ఏ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా ఇస్టిండియా కంపెనీ పాలనలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు?
1.రెగ్యులేటింగ్‌ చట్టం 1773 2. 1813 చార్టర్‌ చట్టం
3. 1784 పిట్స్‌ ఇండియా చట్టం 4. 1833 చార్టర్‌ చట్టం
7. క్రింది వాక్యాలలో సరికాని వాక్యం / వాక్యాలు గుర్తించండి.
ఎ. బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వహక మండలి సభ్యుల సంఖ్యను 4 నుండి 3 కి తగ్గించారు – 1813 చార్టర్‌ చట్టం.
బి. పరిపాలన అంశాలను 2 రకాలుగా విభజించిన చట్టం 1784 పిట్స్‌ ఇండియా చట్టం.
1. ఎ మాత్రమే 2. ఎ,బి
3. బి మాత్రమే 4. ఏది కాదు.
8. జతపరుచుము.
ఎ. మున్సిపాలిటీలకు చట్టబద్దత 1. 1813 చార్టర్‌ చట్టం
బి. అతి తక్కువ కాలం అమలులో 2. 1853 చార్టర్‌ చట్టం
ఉన్న చార్టర్‌ చట్టం
సి. లా కమీషన్‌ ఏర్పాటు 3. 1793 చార్టర్‌ చట్టం
డి. స్థానిక సంస్థలకు పన్ను విధించే 4. 1833 చార్టర్‌ చట్టం
1. ఎ1,బి3,సి2,డి4 2. ఎ1,బి2,సి3,డి4
3. ఎ3,బి2,సి4,డి1 4. ఎ3,బి4,సి2,డి1
9. క్రింది ఏ చట్టమును అనుసరించి భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానమును ప్రవేశపెట్టారు?
1. 1919 భారత ప్రభుత్వ చట్టం
2. 1909 భారత కౌన్సిల్‌ చట్టం
3. 1892 భారత కౌన్సిల్‌ చట్టం
4. 1861 భారత కౌన్సిల్‌ చట్టం
10.క్రింది వాటిలో 1861 భారత కౌన్సిల్‌ చట్టం గురించి సరైన వాక్యం / వాక్యాలు గుర్తించండి.
1. ఐఎన్‌సి ఏర్పాటు తర్వాత ఏర్పడిన తొలి చట్టం
2. తొలిసారిగా రాష్ట్రాలలో శాసన మండలాల ఏర్పాటు.
3. దేశంలో తొలిసారిగా పోర్ట్‌ పోలియో విధానం ప్రవేశపెట్టారు.
4. 2 మరియు 3
11. క్రింది ఏ చట్టం ప్రకారం గవర్నర్‌ జనరల్‌ కార్య నిర్వహక మండలిలో తొలిసారిగా భారతీయులకు అవకాశము కల్పించారు?
1. 1909 భారత కౌన్సిల్‌ చట్టం
2. 1892 భారత కౌన్సిల్‌ చట్టం
3. 1861 భారత కౌన్సిల్‌ చట్టం 4. పై ఏది కాదు.
12. క్రింది ఏ చట్టం ను అనుసరించి కేంద్రములో తొలిసారిగా ద్విసభ విధానమును ప్రవేశపెట్టారు?
1. 1909 భారత కౌన్సిల్‌ చట్టం
2. 1935 భారత ప్రభుత్వ చట్టం
3. 1919 భారత ప్రభుత్వ చట్టం
4. 1947 భారత ప్రభుత్వ చట్టం
13.క్రింది వాటిలో 1919 భారత ప్రభుత్వ చట్టం గురించి సరైన వాక్యం / వాక్యాలు గుర్తించండి.
1. దేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు.
2. మింటో మార్లే సంస్కరణలు అని అంటారు.
3. గవర్నర్‌ జనరల్‌ శాసన మండలి సభ్యుల సంఖ్య 16 నుండి 60 కి పెంచారు.
4. పైవన్నీ
14. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది?
1. 7 సెప్టెంబరు 1930 – 7 డిసెంబరు 1930
2. 12 నవంబరు 1930 – 19 జనవరి 1931
3. 17 నవంబరు 1932 – 24 డిసెంబరు 1932
4. 7 సెప్టెంబరు 1930 – 7 డిసెంబరు 1931
15. సైమన్‌ కమీషన్‌ ఏ సం.లో తన నివేదికను బ్రిటిషు ప్రభుత్వానికి సమర్పించింది?
1. 1927 2. 1928 3. 1930 4. 1932
16. క్రింది ఏ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా రాజ్యాంగ చట్ట నిర్మాణంలో భారతీయులకు అనధికార సభ్యులుగా తొలిసారిగా అవకాశాన్ని కల్పించారు?
1. 1892 భారత కౌన్సిల్‌ చట్టం
2. 1861 భారత కౌన్సిల్‌ చట్టం
3. 1909 భారత కౌన్సిల్‌ చట్టం
4. ఏది కాదు.
17. 2వ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది?
1. 7 సెప్టెంబరు 1931 – 7 డిసెంబరు 1931
2. 13 నవంబరు 1931 – 19 జనవరి 1932
3. 17 నవంబరు 1932 – 24 డిసెంబరు 1932
4. 7 సెప్టెంబరు 1931 – 1 డిసెంబరు 1931
18. గాంధీ – ఇర్విన్‌ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1.13 నవంబర్‌ 1931 2. 5 మార్చి 1931
3. 17 మార్చి 1931 4. 7 డిసెంబరు 1931
19. క్రింది ఏ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన చేశారు?
1. 1858 భారత ప్రభుత్వ చట్టం
2. 1919 భారత ప్రభుత్వ చట్టం
3. 1935 భారత ప్రభుత్వ చట్టం
4. 1947 భారత ప్రభుత్వ చట్టం
20. క్రింది వాటిలో సైమన్‌ కమీషన్‌ యొక్క సిఫార్సులు ఏవి?
ఎ.భారత్‌ లో సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటు
బి. మత నియజక వర్గాల కొనసాగింపు
సి. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం
డి. రాష్ట్ర శాసన మండలాల్లో సభ్యుల సంఖ్య పెంచడం.
1. ఎ,బి,సి 2. సి మాత్రమే
3. ఎ,బి,డి 4. ఎ,బి,సి,డి
21. 1773 రెగ్యులేటింగ్‌ చట్టం గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. తొలి సుప్రీంకోర్టు ఏర్పాటు. 2. ప్రప్రధమ రాజ్యాంగ చట్టం
3. కంపెనీకి 20 సం.ల పాటు వ్యాపారం చేసుకొనే అనుమతి లభించింది.
4. పైవన్నీ
22. క్రింది ఏ చట్టం ప్రకారం గవర్నర్‌ జనరల్‌కు కౌన్సిల్‌ తీర్మానాలపై ‘వీటో’ అధికారం కల్పించారు?
1. 1813 చార్టర్‌ చట్టం 2. 1833 చార్టర్‌ చట్టం
3. 1793 చార్టర్‌ చట్టం 4. 1853 చార్టర్‌ చట్టం
23. క్రింది ఏ చట్టం ప్రకారం దేశంలో ద్వంద్వ పాలన రద్దు అయ్యింది.
1. 1892 కౌన్సిల్‌చట్టం 2. 1858 భారత చట్టం
3. 1909 కౌన్సిల్‌ చట్టం 4. 1935 భారత చట్టం
24. అక్వర్త్‌ కమిటీ సిఫార్సు మేరకు సాధారణ బడ్జెటు నుండి రైల్వే బడ్జెటును 1921లో వేరు చేశారు కాగా ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది.
1. 1921 2. 1928 3. 1932 4. 1924
25. జతపరుచుము.
ఎ. 1858 భారతప్రభుత్వ చట్టం 1. కేంద్ర శాసన మండలికి
బడ్జెట్‌పై చర్చించే వీలు.
బి. 1892 భారత కౌన్సిల్‌ చట్టం 2. భారత రాజ్య కార్యదర్శి
సి.1861 భారత కౌన్సిల్‌ చట్టం 3. ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారం.
డి. 1909 భారత కౌన్సిల్‌ చట్టం 4. బడ్జెటు తో సహా అన్ని
అంశాలపై ప్రశ్నించే ధికారం.
1.ఎ2,బి3,సి4,డి1 2.ఎ3,బి4,సి1,డి2
3.ఎ1,బి2,సి3,డి4 4.ఎ2,బి1,సి3,డి4
సమాధానాలు
1.3 2.4 3.3 4.3 5.3
6.3 7.1 8.3 9.2 10.4
11.1 12.3 13.1 14.2 15.3
16.2 17.4 18.2 19.3 20.3
21.4 22.3 23.2 24.4 25.4
డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు
9494228002

Spread the love