‘హరిత ఆర్థిక వ్యవస్థ’ భావనను ఏ పర్యావరణ సదస్సులో ప్రవేశపెట్టటం జరిగింది?

'హరిత ఆర్థిక వ్యవస్థ' భావనను ఏ పర్యావరణ సదస్సులో ప్రవేశపెట్టటం జరిగింది?పర్యావరణ అస్థిరత, వాతావరణ మార్పులు, ధ్వంసమై పోతున్న జీవ వైవిధ్యం వంటి అనేక ముఖ్యమైన పర్యావరణ సమస్యలకు సంబంధించి ప్రపంచం ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించడంలో పర్యావరణ సదస్సులు, సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణ సమస్యల పరిష్కారంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిశోధన సాధించిన ప్రగతిని అన్ని దేశాలకి అందివ్వటం, తద్వారా అన్ని దేశాలని సమిష్టి గా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో కార్యోన్ముఖుల్ని చేయటానికి ఈ సదస్సులు దోహదపడతాయి. ఈ సదస్సులు ద్వారా రూపొందించే ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు. కార్యాచరణ ప్రణాళికలు నిర్దేశించే లక్ష్యాలను చేరుకోవటంలో అన్ని దేశాలు చిత్తశుద్ధితో కషి చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ, అగ్రదేశాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పర్యావరణ సదస్సులు, సంస్థలు అనేక సవాళ్లతో కూడిన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. విభిన్న ప్రాధాన్యతలు, ఆర్థిక లక్ష్యాలు, అభివద్ధి వంటి అంశాలలో ఎన్నో తారతమ్యాలు ఉన్న దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధిం చడం పర్యావరణ సదస్సులు, సంస్థలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాళ్లలో ప్రధానమైనది. ఏది ఏమయినప్పటికీ, పర్యావరణ సద స్సులు ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో మరియు స్థిరమైన అభివద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. మొట్టమొదటిసారిగా 1972లో స్టాక ్‌హౌమ్‌లో మానవ పర్యావరణంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సమా వేశం పర్యావరణం ఎదుర్కొంటున్న, సమస్యలు తద్వారా మానవాళి ఎదుర్కొనే సమస్యల మీద ప్రధానంగా చర్చించిన మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సుగా నిలిచింది. అప్పటి నుండి నేటి వరకు పర్యావరణ సదస్సుల ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
1. ‘మానవుడు – పర్యావరణం’ అనే అంశంపై పర్యావరణ సదస్సు ఎప్పుడు జరిగింది?
ఎ) 1982 బి) 1972 సి) 1992 డి) 1962
2. ఈ కింది వాటిలో ఏది సముద్ర పరిరక్షణకి సంబంధించిన సమావేశం?
ఎ) రియో+20 బి) జఉూ21
సి) సస్టైనబుల్‌ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్‌ డి) ఔూూణ
3. జ×ుజుూ సమావేశం ప్రధానంగా ఈ కింది వాటిలో దేని మీద దష్టి సారిస్తుంది ?
ఎ) వాతావరణ మార్పు
బి) అంతరించిపోతున్న జాతుల వ్యాపారం
సి) ఓజోన్‌ క్షీణత డి) సముద్ర కాలుష్యం
4. క్యోటో ప్రోటోకాల్‌ ఏ కాలుష్యాన్ని తగ్గించడాన్ని నిర్దేశిస్తుంది ?
ఎ) అటవీ నిర్మూలన బి) ఓజోన్‌ క్షీణత
సి) గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు డి) సముద్ర కాలుష్యం
5. ఆర్కిటిక్‌ కౌన్సిల్‌ ఈ కింది వాటిలో దేని సంరక్షణకి కషి చేస్తుంది ?
ఎ) ఎడారీకరణ బి) సముద్ర సంరక్షణ
సి) అటవీ నిర్వహణ డి) పునరుత్పాదక శక్తి
6. రామ్‌సర్‌ కన్వెన్షన్‌ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ?
ఎ) అటవీ సంరక్షణ బి) చిత్తడి నేల పరిరక్షణ
సి) సముద్ర సంరక్షణ డి) ఎడారి పరిరక్షణ
7. ”గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ” ఈ కింది వాటిలో వేటికి సంబంధించిన ప్రాజెక్ట్‌ లకు నిధుల్ని అందిస్తుంది ?
ఎ) వాతావరణ మార్పు బి) జీవవైవిధ్యం
సి) పునరుత్పాదక శక్తి డి) పైవన్నీ
8. హరిత ఆర్థిక వ్యవస్థ భావనను ఏ పర్యావరణ సదస్సులో ప్రవేశపెట్టటం జరిగింది ?
ఎ) సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌పై వరల్డ్‌ సమ్మిట్‌ (ఔూూణ)
బి) యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌, రియో+20
సి) జఉూ21 సదస్సు
డి) ఎర్త్‌ సమ్మిట్‌ 1992
9. యునైటెడ్‌ నేషన్స్‌ ఫోరమ్‌ ఆన్‌ ఫారెస్ట్స్‌ (ఖచీఖీఖీ) సంస్థ స్థాపనకు దారితీసిన సమావేశం ఏది?
ఎ) ఎర్త్‌ సమ్మిట్‌ 1992 బి) జఉూ21
సి) రియో+20 డి) క్యోటో సమ్మిట్‌
10. గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌ అనేది ఏ సదస్సు తీర్మానం ఆధారంగా ఏర్పటు చేయబడింది ?
ఎ) జఉూ 3 బి) జఉూ16
సి) జఉూ21 డి) రియో ఎర్త్‌ సమ్మిట్‌
11. డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్మెంట్‌ లో సెండారు ఫ్రేమ్‌వర్క్‌ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
ఎ) వాతావరణ మార్పు అనుసరణ
బి) స్థిరమైన అభివద్ధి లక్ష్యాలు
సి) విపత్తు ప్రమాదం తగ్గింపు మరియు స్థితిస్థాపకత
డి) మహాసముద్రాలు మరియు సముద్ర సంరక్షణ
12. ఈ కింది వాటిలో బాన్‌ ఛాలెంజ్‌ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ) మహాసముద్రాలు సంరక్షణ బి) అడవులు సంరక్షణ
సి) చిత్తడి నేలలు సంరక్షణ డి) గడ్డి భూములు సంరక్షణ
13. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (ఖచీజుూ) ఏ సమావేశం తర్వాత ప్రారంభించబడింది?
ఎ) స్టాక్‌హౌమ్‌ కాన్ఫరెన్స్‌ బి) క్యోటో సమావేశం
సి) ఎర్త్‌ సమ్మిట్‌ 1992 డి) రియో+20
14. 2012లో క్యోటో ప్రోటోకాల్‌ నుండి వైదొలగిన దేశం ఏది ?
ఎ) అమెరికా బి) చైనా సి) రష్యా డి) కెనడా
15. ఈ కింది వాటిలో మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ దేనికి సంబంధించింది ?
ఎ) ఓజోన్‌ పొర బి) మంచినీటి వనరులు
సి) అడవులు డి) ఎడారులు
16. పారిస్‌ ఒప్పందం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది ?
ఎ) 2010 బి) 2015 సి) 2005 డి) 2000
17. 1992లో జరిగిన రియో ఎర్త్‌ సమ్మిట్‌ ఏ దేశంలో జరిగింది ?
ఎ) ఇటలీ బి) స్విట్జర్లాండ్‌ సి) బ్రెజిల్‌ డి) జపాన్‌
18. పారిస్‌ ఒప్పందం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
ఎ) అటవీ నిర్మూలనను తగ్గించండి
బి) భూతాపాన్ని పరిమితం చేయండి
సి) పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచండి
డి) గాలి నాణ్యతను మెరుగుపరచడం
19. పర్యావరణ సదస్సుల సందర్భంలో జఉూ అనేది దేనిని సూచిస్తుంది?
ఎ) ఓజోన్‌ రక్షణపై సమావేశం
బి) పార్టీల సమావేశం
సి) కాలుష్యంపై సమావేశం డి) పార్టీల కమిటీ
20. మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (వీణ+లు) దిశగా సాధించిన పురోగతిపై సమీక్షించిన సమావేశం ఏది?
ఎ) ఔూూణ బి) ఎర్త్‌ సమ్మిట్‌ 2002
సి) రియో+20 డి) నైరోబి సమ్మిట్‌ 2006
21. 1994లో జరిగిన కన్వెన్షన్‌ ఆన్‌ బయలాజికల్‌ డైవర్సిటి ఒప్పదంపై ఎన్ని దేశాలు సంతకాలు చేసాయి ?
ఎ) 175 బి) 157 సి) 126 డి) 162
22. 2002లో సుస్థిరాభివద్ధి – పర్యావరణం అనే అంశంపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశం (ఔూూణ) ఏ దేశంలో జరిగింది ?
ఎ) ఢిల్లీ, భారత దేశం బి) లండన్‌, అమెరిక
సి) పారిస్‌, ఫ్రాన్స్‌ డి) జోహన్నెస్‌బర్గ్‌, దక్షిణాఫ్రికా
23. రోటర్‌డ్యామ్‌ కన్వెన్షన్‌ ఈ కింది వాటిలో దేనికి సంభందించింది ?
ఎ) చిత్తడి నెలలు బి) వన్య మగాల సంరక్షణ
సి) ప్రమాదకర రసాయనాల అంతర్జాతీయ వాణిజ్యం
డి) పైవేవి కాదు
24. ఐక్యరాజ్య సమితి అధ్వర్యంలో 2012లో జరిగిన జీవవైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది ?
ఎ) న్యూయార్క్‌ బి) హైదరాబాద్‌
సి) న్యూ డిల్లి డి) డెన్మార్క్‌
25. 2023లో జరిగిన కాప్‌ – 28 సదస్సుకి ఏ దేశం అతిధ్యమిచ్చింది ?
ఎ) ఇండియా బి) అరబ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌
సి) మాడ్రిడ్‌ డి) యున్కెటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
సమాధానాలు
1. బి 2. సి 3. బి 4. సి 5. బి
6. బి 7. డి 8. బి 9. ఎ 10. బి
11. సి 12. బి 13. ఎ 14.డి 15. ఎ
16. బి 17. సి 18. బి 19. బి 20. డి
21. ఎ 22. డి 23. సి 24. బి 25. డి
డాక్టర్‌ కె. శశిధర్‌ పర్యావరణ నిపుణులు
94919 91918

Spread the love