మేడే సందర్భంగా సీఐటీయూ జండావిష్కరణ

నవతెలంగాణ – తొగుట
పెరుగుతున్న ధరలకు అనుకూలంగా నెలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ వసంత డిమాండ్ చేశారు. బుధ వారం మండల కేంద్రంలో ప్రపంచ కార్మీక దినోత్స వం మేడే సందర్భంగా గ్రామ పంచాయితి కార్మిక సంఘం నాయకులు మస్కురి శంకర్, ఆశా, అంగ న్వాడీ, గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా 1886లో చికాగో నగరంలో హే మార్కెట్లో హక్కుల సాధన కోసం కార్మికులు వీరో చితమైన పోరాటం చేశారన్నారు. కార్మికులపై పెట్టు బడుదారులు, ప్రభుత్వం కలిసి పోలీసులచే కాల్పు లు జరిపించి అనేకమంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. మరణించిన అమరవీరు ల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం, యూనియన్ పెట్టుకునే హక్కు, వేత నాలు రోజువారి కూలీలు వెంచుకునే బేరాసారాల హక్కు లభించిందని గుర్తు చేశారు. దేశంలోనీ బిజెపి ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ పెట్టుబడుదారులకు లాభాలు చేకూరుస్తూ కార్మికుల అన్యాయం చేస్తుందని విమర్శించారు. దేశంలో స్కీం వర్కర్లు గా పనిచేస్తు న్న వారిని కార్మికులుగా గుర్తించడానికి కేంద్ర ప్రభు త్వం సిద్ధంగా లేదన్నారు. అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ కార్మికులకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుకూలంగా నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రోజుకు 178 రూపాయలు వేత నం ఉంటే సరిపోతుందని నిర్ణయం చేయడం సరి కాదన్నారు. కార్మికులను మోసం చేయడమే తప్ప మరోటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 కార్మిక చట్టాలు రద్దు చేయడం వల్ల యూనియన్ పెట్టు కునే హక్కు, సమ్మె చేసే హక్కు పూర్తిగా రద్దు అవు తుందని మండిపడ్డారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ విదేశీ, స్వదేశీ సంస్థలకు అప్పగిస్తూ దేశ సంపాదన లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్మికులు మాధవి, రేణుక, రేఖ, భాగ్య, శ్యామల, జ్యోతి, దేవమ్మ, విజయ, సునీత, శోభ, ఆశా కార్మి కుల మండల అధ్యక్షురాలు ప్రావీన, గ్రామ పంచా యతీ కార్మికుల మండల అధ్యక్షుడు మస్కురి శంకర్, నర్సింలు, మాణిక్యం, బాల్ రాజ్, రాములు, శ్యామల, నర్సయ్య, పోచయ్య, సాయిలు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Spread the love