నవతెలంగాణ – మల్హర్ రావు
ధాన్యం కొనుగోలులో కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లు పారదర్శకత, బాధ్యత పాటించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.గురువారం ఆయన మండలంలోని కొండంపేట, కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామాలల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు, రైతులకు విక్రయాల్లో పాటించాల్సి జాగ్రత్తలు, పలు సూచనలు చేశారు.రైతులు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదుర్కొనే సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కొలతలు, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.రైతులు పంట ఉత్పత్తులు సురక్షితంగా విక్రయించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తూ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ తనిఖీలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్,రైతులు పాల్గొన్నారు.