అన్ని సంస్కృతుల సమ్మేళనం భారత దేశం

– ఛైర్మన్ బాలకృష్ణ…
నవ తెలంగాణ – బంజారా హిల్స్
అన్ని సంస్కృతులకు సమ్మేళనాలకు భారతదేశం పుట్టినిల్లుని బసవతారకం ఇండో అమెరికన్ చైర్మన్ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
బంజర హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని బసవతారకం రెండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో భాగంగా కొనసాగుతున్న యాడ్ లైఫ్ యోగ జిమ్ నేచురోపతి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎందరో క్యాన్సర్ రోగులకు అలాగే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న సేవా కేంద్రంగా పేరుపొందింది. 20 సంవత్సరాలుగా నగరంలో ఎక్కడ లేనివిధంగా ప్రత్యేకంగా పూలతో అలంకరణ నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా సుమారు వందల మందికి పైగా ఉన్న సిబ్బందికి ప్రత్యేక కేరళ వంటలతో భోజనాలు ఏర్పాటు చేసి ఓనం పండగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఈవో ఆర్ వి ప్రభాకర్ రావు అసోసియేట్ డైరెక్టర్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ యాడ్ లైఫ్ హెడ్ డాక్టర్ కల్పనా రఘునాథ్, మెడికల్ డైరెక్టర్ పని కోటేశ్వరరావు, కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సీఈఓ ఆర్ వి ప్రభాకర్ రావు మాట్లాడుతూ… 20 సంవత్సరాలు సమాజ హితం కొరకు క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సేవన అందిస్తున్న యాడ్ లైఫ్ యోగ నేచురోపతి వైద్యులు సిబ్బందికి ముందుగా ఓనం శుభాకాంక్షలు తెలిపారు. కేరళ లో ఈ పండగ 10 రోజులుగా జరుపుకుంటారని వారి సంస్కృతి సాంప్రదాయలకూ నిల్వుటాద్దంగా జరిగే ఈ పండగ ప్రత్యేకంగా నిర్వహించబడుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యుల బృందం నీచురోపతి వైద్యులు డాక్టర్ సుమతి,డా” సుభద్ర, డా”శింబు, డా” కిరణ్,డాక్టర్ ఉదయ్, యాడ్ లైఫ్ మేనేజర్ ఆదిత్య, జిమ్ ట్రైనర్స్ సిబ్బంది టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love