Saturday, July 18, 2026
E-PAPER
Homeబీజినెస్ద్రవ్యోల్బణమే అసలు సవాలు

ద్రవ్యోల్బణమే అసలు సవాలు

- Advertisement -

ఆర్‌‌బిఐ గవర్నర్‌ మల్హోత్రా వెల్లడి
త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు
పైలట్ ప్రాజెక్ట్‌కు సన్నద్దం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ అనిశ్చితులను తట్టు కునేం త బలంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతలు, రుతుపవనాల ప్రభావం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో భారత జిడిపి 6.6 శాతం వృద్ధి న మోదు చేస్తుందని అంచనా వేశారు. బ్యాంకింగ్ రంగం ఆరో గ్యకరంగా ఉందని, మూలధన సమృద్ధి బలంగా ఉండటంతో పాటు రుణాల వృద్ధి అన్ని రంగాల్లో ఆశాజ నకంగా కొనసాగుతోందన్నారు. జూన్ నాటికి బ్యాంకింగ్ క్రెడిట్ వృద్ధి 18 శాతానికి చేరిందని, వ్యవసాయం, పరిశ్రమలు, గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఇ రంగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని వెల్లడించారు.అయితే.. ఇటీవల పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రుతుపవనాల అనిశ్చితి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని గవర్నర్ హెచ్చరించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచుతూ ఆర్థిక వృద్ధిని కొనసాగించడం ఆర్‌‌బిఐ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డాలర్ బలపడుతున్నప్పటికీ రూపాయి ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే స్థిరంగా ఉందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలు ఎగుమతులకు మద్దతునిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఎఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే డేటా భద్రత, సైబర్ ముప్పులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -