చిన్నపూర్ గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు

నవతెలంగాణ- మోపాల్

మోపాల్ మండలంలోని చిన్నపుర్  గ్రామంలో ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మోపాల్ ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటనారాయణ తో కలిసి మంగళవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఎస్సై రామ్ మాట్లాడుతు ఒక సీసీ కెమెరా దాదాపుగా వందమంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాలు గ్రామానికి రక్షణ వలయంగా ఉంటాయని 24 గంటలు గ్రామం లో ఎటువంటి సంఘటన జరిగిన దానితో తెలుసుకోవచ్చని, చిన్నాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా   తీసుకొని మండలంలోని మిగతా గ్రామాలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చిన్నాపూర్ గ్రామస్తులు మాట్లాడుతు ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన పోలీసు వారు ఎవరు  తమకు చెప్పలేదని, ఎస్సే రామ్ చెప్పిన వెంటనే ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల వల్ల ఉపయోగం గురించి తమకు చెప్పి మా గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకునేటట్టు చేశారని  గ్రామస్తులు కూడా తెలియజేశారు. మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఎస్సై కి మరియు పోలీస్ సిబ్బందికి ధన్య వాదాలు తెలియజేశారు.
Spread the love