నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుల్సుంపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవ్య అనే విద్యార్థిని బుధవారం రాత్రి ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై నవ్య తల్లిదండ్రుల ఆరోపణలు వేరేలా ఉన్నాయి. తమ ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళ్తున్నారని.. అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని నవ్య తల్లిదండ్రులు చెబుతున్నారు.