బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ – బాసర
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న దీపిక ఏ3 బ్లాక్ లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన దీపికను భైంసా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్. ఆమె బాత్రూంకు వెళ్లి ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు.. సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్దలు కొట్టి చూసేసరికి చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. దీపిక మృతి పట్ల అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Spread the love