నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ సింగిల్ విండో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో శనివారం నాడు అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంగా కార్యాలయం ఎదుట సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఏడు రంగుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సింగిల్ విండో కార్యాలయంలో అంతర్జాతీయ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సింగిల్ విండో వైస్ చైర్మన్ శంకర్రావు సంఘం కార్యవర్గ సభ్యులు సింగిల్ విండో కార్యదర్శి బాబురావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.