గురుకుల పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Applications invited for Gurukula School..నవతెలంగాణ – మోపాల్ 

తెలంగాణ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశాలకు  ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విద్యార్థుల దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లుగా కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ జి విజయ లలిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 -25 విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఐదవ తరగతికి అర్హులనీ తెలిపారు. 5వ తరగతి కామన్ ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు తీసుకోబడుతుందన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కూడా దరఖాస్తులు తీసుకోబడుతుందన్నారు. దరఖాస్తుల చివరి తేదీ 1 ఫిబ్రవరి 2025 వరకు ఉందని దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు తో పాటు కులం ఆదాయం ఆధార్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫోటో రూ.100 రుసుముతో ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Spread the love