
కేసీఆర్ సంక్షేమ పథకాలు రాని గడప తెలంగాణలో లేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బుధవారం బోధన్లో ఆయన ప్రసంగించారు. 15 ఏళ్లు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కనీస సహాయం చేయలేదని, అలాంటి వ్యక్తి బోధన్కు అవసరమా.. అని ప్రశ్నించారు. అభివృద్ధి బాటలో వెల్దామా మత రాజకీయాలు చేద్దామా.. ప్రజలు ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.