పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా?

– వైఎస్‌ షర్మిలపై రేణుకా చౌదరి సెటైర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాలేరు నుంచి పోటీ చేస్తామంటూ చాలా మంది నాయకులు చెబుతున్నారనీ, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా?అంటూ వైఎస్‌ఎస్‌ షర్మిలపై మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి సెటైర్లు వేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అంటూ తనను కలిసి విలేకర్లతో ఆమె పై విధంగా స్పందించారు. పాలేరు కాదు…షర్మిల ముందు అమరావతి రైతుల సమస్యలపై మాట్లాడాలని సూచించారు. తెలంగాణ కోడలన్న విషయం షర్మిలకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిల ఎంతనో.. ఏపీలో తాను కూడా అంతేనని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. తాను ఏపీ కోడల్ని అన్న ఆమె… తెలంగాణ బిడ్డనని గుర్తు చేశారు. తెలంగాణలో షర్మిల పోటీ చేసే విషయమై అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. షర్మిల విషయంలో అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

Spread the love