దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి నీరాజనం పలికే తీరు ఇదేనా?

నవతెలంగాణ – చేర్యాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుతుంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే విధంగా ఆరోజు చేర్యాల పట్టణ కేంద్రంలో నెలకొల్పబడిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఉత్సవాల సందర్భంగా కనీసం శుద్ధికరణ, అలంకరణ జరగలేదు. కనీసం పూలదండ వేసే దిక్కులేదు. అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కొనియాడుతున్నాం.. కాని తెలంగాణ తల్లి విగ్రహం పక్కనే ఉన్న అమరవీరుల స్థూపానికి కనీసం నివాళులర్పించక పోవడం పట్ల చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులు పెదవి విరుస్తున్నారు.

Spread the love