బాల వికాస సంస్థపై ఐటీదాడులు అమానుషం : ఎర్రబెల్లి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 25, 30 ఏండ్ల నుంచి దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న బాల వికాస సంస్థపై ఐటీ దాడులు చేయడం అమానుషమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాల వికాస క్రిస్టియన్‌ మిషనరీ సంస్థ అవడం వల్లే ఈ ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ దాడులు కక్ష సాధింపు చర్యలో భాగమేనని పేర్కొన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.

Spread the love