నవతెలంగాణ- నసురుల్లాబాద్
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఓటర్లను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరికాదని సంస్కారవంతులు ఎదుటివారిని గౌరవిస్తారని మాజీ ఎంపిటిసి ఫోరం కన్వీనర్ కంది మల్లేష్ అన్నారు మంగళవారం నసురుల్లాబాద్ మండలంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కంది మల్లేష్ మాట్లాడుతూ నసురుల్లాబాద్ గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన అనుచరులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ వెంటనే ఉంటున్నారంటూ నర్సుల్లాబాద్ గ్రామంలో వారు చేసింది ఏమీ లేదంటూ మాట్లాడారు. కరోనా సమయంలో ఎవరిని ఆదుకోలేదని కులాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడాన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. టిఆర్ఎస్ నాయకులకు సంస్కారం గౌరవం ఉందని ఆపదలో ఉన్నవారికి వెన్నంటూ ఉన్నామన్నారు అలాగే నిరుపేదలకు సంక్షేమ పథకాలు వచ్చేలా చూసామన్నారు. గ్రామం అభివృద్ధి విషయంలో చర్చకు రావాలంటూ ప్రశ్నించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కొందరు కాంగ్రెస్ నాయకులు కట్టకుండానే బిల్లులు తీసుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి జీర్ణించుకోలేక వీరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. వీరి వెంట నర్సింలు గౌడ్, మైషా గౌడ్, ఖలీల్, గంగారం, ఫయాజ్, శేఖర్, సత్తార్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు