– బీసీ కమిషన్ చైర్మెన్ జి నిరంజన్ స్పష్టం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముదిరాజులను బీసీ- డీ నుంచి బీసీ-ఏలో చేర్చేందుకు సానుకూలంగా ఉన్నట్టు బీసీ కమిషన్ చైర్మెన్ జి.నిరంజన్ వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తామని తెలిపారు. బుధవారం బీసీ కమిషన్ కార్యాలయంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల సంతోష్, సలేంద్ర శివయ్య ముదిరాజ్ తదితరుల ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర కమిటీ నాయకులు బీసీ కమిషన్ చైర్మెన్, సభ్యులు రంగం బాలలక్ష్మితో భేటీ అయ్యారు. కులగణనకు వచ్చే అధికారులకు సైతం ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. నిర్ధిష్టమైన ఆదేశాలను అధికారులకు సూచించి, జవాబుదారీగా వ్యవహరించే విధంగా చూడాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో సైతం ముదిరాజ్ సామాజిక వర్గానికి వృత్తిపరమైన ఇబ్బందులను తొలగించాలని సూచించారు.