కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడేది కాంగ్రెస్ పార్టీ

– కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి
– లక్కొర ఏఎన్జీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బుదవారం వేల్పూర్ మండలంలోని లక్కొర గ్రామ సమీపంలోని ఏ ఎన్ జి ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది  అన్నారు.మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా, బాల్కొండ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఉన్న బాల్కొండ నియోజక వర్గ కేంద్రంలో బస్టాండ్ లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. తాను స్వయంగా బాల్కొండలో పరిస్థితిని చూశానని, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోడ్డు పైన నిలబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారని ఇది నిజాం కాదా? అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు. అంతేకాకుండా బాల్కొండలో సమీకృత మార్కెట్ యార్డు లేని కారణంగా మాంసం విక్రయదారులు రోడ్డు పైన రెండు వైపులా మాంసం విక్రయిస్తున్నారన్నారు. బాల్కొండ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో చేపలు విక్రయిస్తున్న విషయం నిజాం కాదా? అని ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గెలుపు గెలుపు కాదని, నైతికంగా సునిల్ కుమార్ గెలిచారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రిగా ఉండి బాల్కొండ నియోజక వర్గ కేంద్రానికి ఏం చేసావని ప్రశాంత్ రెడ్డి ని  ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ అవినీతి కుంభ కోణాలు, భీమ్ గల్ ప్రాంతంలో గంజాయి సాగుకు ప్రోత్సహించింది నిజం కాదా? అన్నారు.నీ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు  కేసులు బనాయించిన సంగతి అందరికి తెలిసిందేనన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని,ఈ సందేశాన్ని అన్ని గ్రామాలకు తీసుకువెళ్లను  కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ ఆంధ్ర నేషనల్ యూత్ ప్రాజెక్టు, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ ఆసియా మైత్రి సదస్సు కోశాధికారి ముత్యాల సునిల్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో  బాల్కొండ కాంగ్రెస్ కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వo  కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన మా కాంగ్రెస్ కార్యకర్తలు బయపడకుండా సహనంతో ఓపిక పట్టారన్నారు. అందుకు పార్టీ కార్యకర్తలను అభినందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అనుచరులు డబ్బు, మద్యం, చికెన్ పంపిణీ చేసిన కేవలం 3వేల చిలుకు ఓట్లతో గెలిచారన్నారు. ఓడి పోయిన కూడా తనతో వెన్నంటి ఉన్నందుకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భీంగల్ ప్రాంతంలో  మత్తు మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా జరిగితే దీనికి వత్తాసు పలికి యువకుల భవిష్యత్తు నాశనం చేసిన ఘనత గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రశాంత్ రెడ్డిది కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అమాయకులైన వారిపై గంజాయి అక్రమ రవాణా పేరుతో అక్రమ కేసులు పెట్టించిన విషయం ప్రజా నిజానికి తెలిసిందేనని అన్నారు.నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్  పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సభ ప్రాంగణంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డీ, ఎన్ డి సి సి పి చైర్మన్ రమేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సదానంద్,నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love