వరద ప్రాంతాల్లోఐటీడీఏ పీవో అంకిత్ పర్యటన..

– పురావాస బాదితుల పరామర్శ
నవతెలంగాణ-మంగపేట : మండల కేంద్రంలోని వరద ప్రాంతాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ గురువారం సందర్శించి పునరావాస కేంద్రాల్లో ఉన్న 66 కుటుంబాల్లోని 164 మంది బాదితులను పరామర్శించి వారితో మాట్లాడారు. పునరావాసంలోని బాదిత కుటుంబాలకు టిఫిన్, భోజన వసతి కల్పించాలని తహసీల్దార్ ను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో పొంగి పొర్లుతున్న గౌరారం వాగును సందర్శించి కోతకు గురైన నర్సాపురం బోరు గ్రామం వైపు బ్రిడ్జీకి పడ్డ గండిని పరిశీలించి వెటనే మరమ్మత్తులు చేయాలని మండల ప్రత్యేక అధికారి తుల రవి, ఇంచార్జ్ ఎంపీడీఓ పి.శ్రీనివాస్ లను ఆదేశించారు. గౌరారం వాగు ఉద్రుతికి కొట్టుకొచ్చి బ్రిడ్జీ కింద కూరుకుపోయిన భారీ వృక్షాలను క్రేన్, జేసీబీల సహాయంతో వెంటనే తొలగించి వరద ఉద్రుతికి అడ్డులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడ నుండి కమలాపురం, రాజుపేట, అకినేపల్లి మల్లారం, చుంచుపల్లిలోని 04, బ్రాహ్మణపల్లిలోని 04 కుటుంబాలు పురావాస కేంద్రాలలో ఉండగా పరిశీలించి బాదితులతో మాట్లాడారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి తుల రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్సై తహెర్ బాబా, ఇంచార్జ్ ఎంపీఓ పి.శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి హీరు నాయక్ లు పాల్గొన్నారు.

Spread the love