16న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: జేఏసీ

నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 16న దేశవ్యాప్త సమ్మె ను కార్మిక సంఘాలు పాల్గొని, జయప్రదం చేయాలని మద్నూర్ మండలంలో సోమవారం నాడు కార్మిక సంఘం నాయకులు ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానానికి, కార్మిక వ్యతిరేక సంఘాలు జేఏసీ ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, బిఎల్టియు, టిఎఫ్ టియు, బిఎఫ్ టియు, టిబిసిటియుసి, తదితర జేఏసీ సంఘాల పిలుపును ప్రతీ కార్మిక సంఘం పాల్గొని, విజయవంతం చేయాలని కార్మిక సంఘం నాయకులు కర్రీవార్ నాగేష్ సమ్మె పోస్టర్లను విడుదల చేశారు.
Spread the love