పెళ్లి పత్రికలో జనసేన మేనిఫెస్టో

నవతెలంగాణ – ఆంధ్రప్రదేశ్: ఓ జనసైనికుడు చేసిన పనికి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే కాక జనసేన కార్యకర్తల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఓ యువకుడు తన పెళ్లి కార్డుపై జనసేన మేనిఫెస్టోను ముద్రించి వినూత్న ప్రచారం చేస్తున్నాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేన అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న విషయం విధితమే. అయితే పిఠాపురం నియోజకవర్గ పరిధి కొత్తపల్లి మండలంలోని కొండవరం గ్రామంలో మేడిశెట్టి కామేష్ అనే జనసైనికుడికి ఇటీవలే పెళ్లి నిశ్చయం అయ్యింది. తన లగ్నపత్రికలో అభిమానాన్ని చాటుకుంటూ.. పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు జనసేన మేనిఫెస్టో కూడా ముద్రించాడు. తన పెళ్లికి రావాలని ఆహ్వానిస్తూనే గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరాడు. అంతేగాక తన పెళ్లి కార్డుతో ఇంటింటికి వెళ్లి ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు. దీంతో జనసైనికుడు కామేష్ పై పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే కాక ప్రజల నుంచి కూడా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

Spread the love