Wednesday, July 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎర్రజెండా ముద్దుబిడ్డ ‘జోయ’

ఎర్రజెండా ముద్దుబిడ్డ ‘జోయ’

- Advertisement -

యార్లగడ్డకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సంతాపం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆమె స్వగృహంలో భౌతికకాయం సందర్శన

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎర్రజెండా ముద్దుబిడ్డ యార్లగడ్డ జోయ (86) మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆవేదన వెలిబుచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జోయ భౌతికకాయాన్ని ఆయన మంగళవారం సందర్శించి, నివాళులర్పించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యార్లగడ్డ జోయ నందిగామ డివిజన్ పార్టీ కార్యదర్శిగా, రైతుసంఘం, మహిళా సంఘం రాష్ట్ర, జిల్లా నేతగా పని చేశారని తెలిపారు. ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సిద్ధాంతం, ఎర్రజెండా పట్ల విశ్వాసం సడలని దీశాలి అని కొనియాడారు. ‘సుదర్శనం ఈ పని చేసి పంపాలి..’ అని ఆప్యాయతతో కూడిన అథారిటీతో ఆమె ఆదేశించే వారని గుర్తు చేశారు. ‘నేను మధిర డివిజన్ పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ముందుగా జోయనే సంప్రదించి ‘క్యాడర్‌‌ను ఎప్పుడు పంపమంటావు?’ అని అడిగేవారని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి, అదీ పక్క డివిజన్‌‌లు కాబట్టి నందిగామ ప్రాంతంలోని పార్టీ కామ్రేడ్స్‌కు ఏ అవసరం వచ్చినా వెంట ఉండి ఆ పని పూర్తి చేసి పంపేవారన్నారు. వారు పేదలైతే పనయ్యాక ‌ఆమే భోజనాలు పెట్టించి పంపేవారని గుర్తు చేశారు. కన్నతల్లిలా క్యాడర్ పట్ల ప్రేమ చూపించేవారని తెలిపారు. ‘అమ్మా జోహార్లు.. ఎర్రెర్రని వందనాలు’ అంటూ జోహార్లర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -