జగన్ పై జేపీ ఫైర్..

నవతెలంగాణ – హైదరాబాద్ : సమకాలీన రాజకీయాలపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ మరోమారు సంచలన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ఐఏఎస్‌లకు ఇటీవల గ్లామర్‌ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో ఏంటని ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ, చివరికి సర్వే రాళ్లపైనా సీఎం జగన్ ఫొటోలు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి సమాజాన్ని దరిద్రంగా తయారుచేస్తున్నారని, దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love