ఆంధ్రప్రదేశ్‌ చేసినట్టుగానే…

– టీవీవీపీ యాక్ట్‌ను రద్దు చేయాలి
– టీఎస్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌గా మార్చాలి :
టీవీవీపీ జీడీఏ, టీవీవీపీ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ యాక్ట్‌ను రద్దు చేసినట్టుగానే తెలంగాణలో తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ యాక్ట్‌ను రద్దు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీవీవీపీ జీడీఏ) , టీవీవీపీ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం టీవీవీపీ జీడీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌, డాక్టర్‌ ఎం.కె.రవూఫ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పొరుగు రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్‌ సేవలను ఏపీ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ గా మార్చి పూర్తిగా ప్రభుత్వ ఆరోగ్య విభాగంగా మారుస్తూ అక్కడి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ టీఎస్‌ సెకెండరీ హెల్త్‌ సర్వీసెస్‌ ను ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతాలు ట్రెజరీ ద్వారా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పరిషత్‌ లో జిల్లాకు ఒక డీసీహెచ్‌ఎస్‌ పోస్టులను సష్టించాలని కోరారు.

Spread the love