వైసీపీ పాలనలో దౌర్జన్యకాండ బీఆర్‌ఎస్‌ ఏపీ చీఫ్‌ తోట

– బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ మైనార్టీ మోర్చా నేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్చగా బతకలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా జోనల్‌ ఇంచార్జీ నాగుల్‌ మీరా,షేక్‌ రబ్బాని సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంధర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించే బీజేపీని దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.

Spread the love