కాంగ్రెస్ తోనే పేద ప్రజలకు న్యాయం 

– నాలుగు నెలలోనే ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 

– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని బస్టాండ్ ప్రాంతంలో ఇంటింటి ప్రచార నిర్వహించిన అనంతరం ఉపాధి కూలీల వద్దకు వెళ్లి అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బిజెపి, పార్టీలు పేద ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పలేదని, వారి పదేళ్ల పాలనలో పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అందుకోసం ఆ పార్టీలను పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పేది లేదని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఎంతోమంది మరణిస్తుంటే వారిని చూడలేకనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి రుణపడి ఉంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలను కేవలం నాలుగు నెలల లోనే ఎక్కువ పథకాలను అమలు చేసిందని అన్నారు. త్వరలోనే రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయబోతున్నామని అన్నారు. మహిళలకు పెద్దపీట వేసిందని తెలిపారు. అంతేకాకుండా పేద ప్రజలు ఇబ్బందులు పడవద్దు అనే ఉద్దేశంతో ఈజీఎస్ పేరుతో రోజు కూలీవారికి ఇక నుండి రోజుకు ఒక్కొక్కరికి రూ.400 చొప్పున రాబోతున్నాయని, గ్యాస్ కూడా రూ.500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నామని తెలిపారు. బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే అతనికి కేంద్ర మంత్రి పద వస్తుందని, దీంతో ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. బలరాం నాయక్ కి కేంద్రంలో ఎంతో బలము ఉందని అతనికి పరిచయాలు బాగా ఉండటంతో మంచి కేంద్ర పదవి వస్తుందని తెలిపారు. కావున పార్టీ కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను తెలిపారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదని అన్నారు.
గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బూతు కమిటీలు తక్షణమే వేయాలి 
కాంగ్రెస్ పార్టీ గ్రామ బూతు కమిటీలను తక్షణమే వేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు గ్రామాలలో బూతుల వారీగా ఒక్కొక్క బూతుకి ఐదుగురు చొప్పున కమిటీలు వేయాలని అన్నారు. ఈ కమిటీలతోనే గ్రామ అభివృద్ధి పనులు గ్రామంలోని సమస్యలను గుర్తించి నిధులు కేటాయించబడతాయని అన్నారు. అంతే కాకుండా ఈ కమిటీ నిర్ణయాల మేరకు గ్రామంలో వివిధ రకాల సమస్యల పైన ఆ పార్టీ జిల్లా యంత్రాంగం స్పందిస్తుందని అన్నారు. లేకుంటే  ఆ బూతులకు జిల్లా అధ్యక్షుడు లేదా మేమే ఉంటామని అన్నారు. కదా గ్రామానికి మాట్లాడే హక్కు తక్కువ ఉంటుందని అన్నారు తక్షణమే కార్యకర్తలు అందరిని కలుపుకొని పోయి గ్రామాలలో సీనియర్ జూనియర్ అనకొండ కూర్చొని కమిటీలు వేసుకొని మండల అధ్యక్షునికి ఇవ్వాలని అన్నారు. ఆ మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షునికి ఇస్తాడని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో మునిగిల వీడు గ్రామస్తులు 
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై మండలంలోని మునిగలవీడు గ్రామంలో కొంతమంది నాయకులతో కలిసి ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఈసంపల్లి వెంకన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సమక్షంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి వారిని స్వాగతించి కండవని కప్పే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీసీ సంఘం జిల్లా నాయకుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు గట్టు ప్రభాకర్ మరియు ఈసంపల్లి మల్లయ్య వెంకటేష్ వీరయ్య మల్లయ్య శ్రీను లు సోమవారం కాంగ్రెస్ తీర్థం సోమవారం పుచ్చుకున్నట్లు తెలిపారు. మీరు పార్టీ నియమాలు కట్టుబడి ఉంటారని తెలిపారు వీరితోపాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు గుగులోతు బాలాజీ నాయక్ కాసం లక్ష్మారెడ్డి మాజీ జెడ్పిటిసి  హెచ్ వెంకటేశ్వర్లు మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి నాయకులు రత్నపురం యాకయ్య వారి పల్లి పూర్ణచందర్ సల్గు పూర్ణచందర్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ మద్ది రాజేష్ వెన్నం క్రాంతి రెడ్డి నరేష్ పులి వెంకన్న హెచ్ మల్లేష్ నరసయ్య నాగన్న కొమురయ్య పులి శ్రీను పట్నం శెట్టి నాగరాజు జాగిరి యాకసైయలు చిన్న బోయిన శ్రీనివాస్ కొంపల్లి శ్రీశైలం యాదవ్ జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Spread the love