పేదలకు న్యాయం చేయాలి

– రెండో వార్డు కౌన్సిలర్‌ బాలమణి శ్రీనివాస్‌ రెడ్డి
నవ తెలంగాణ -గజ్వేల్‌
ప్రజాపాలనతో పేదలకు న్యాయం చేయాలని గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ రెండో వార్డు కౌన్సిలర్‌ బాలమణి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం ప్రజాపాలన భాగంగా పేదలకు పలు దరఖాస్తు ఫారాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా తీసుకుంటున్న ప్రజల విజ్ఞప్తి మేరకు పేదలకు న్యాయం జరగాలని కోరారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులు అజ్గర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పక్షం ఉంటుందన్నారు.

Spread the love