వరల్డ్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతి ఎర్రాజి

Jyoti Errazzi for World Athleticsహైదరాబాద్‌ : ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలుగు తేజం జ్యోతి ఎర్రాజి పోటీపడనుంది. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ 28 మంది అథ్లెట్లకు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఖర్చులను భరించనున్నట్టు వెల్లడించింది. మహిళల 100 మీ హార్డిల్స్‌లో జ్యోతి ఎర్రాజి పతకం కోసం పోటీపడనుంది. 28 మంది అథ్లెట్లలో 13 మంది టాప్స్‌ అథ్లెట్లు కాగా.. 15 మంది తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు. నీరజ్‌ చోప్రా, శాలిని సింగ్‌, అన్నూ రారు, పారుల్‌ చౌదరి, శ్రీశంకర్‌లు భారత అథ్లెటిక్స్‌ జట్టులో ఉన్నారు. ఆగస్టు 19 నుంచి బుదాపెస్ట్‌ (హంగరీ)లో జరుగనున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌కు భారత్‌ 42 మందితో కూడిన (సహాయక సిబ్బంది సహా) బృందాన్ని పంపించనుంది.

Spread the love