వచ్చేనెల 9వ తారీకు న జరగబోయే కాచారం కైలాసపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలోని శ్రీశ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ నేత గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పూర్వ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలకు ఆహ్వాన పత్రికలు దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి అందించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో దాదాపుగా ప్రతి ఒక్కరు తమ తమ ఉద్యోగ వ్యాపారాలలో నిమగ్నమై ఉంటున్న ఈ కాలంలో కూడా డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో పూజారిగా ఉంటూ పలువురికి భక్తి ప్రవచనాలు బోధిస్తు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్గా ఉండడం సంతోషకరమని వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి లక్ష పుష్పార్చన, బోనాల పండుగ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించడం అమ్మవారు కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐ వి ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.