నవతెలంగాణ-సంగెం
తెలంగాణ ఇచ్చినం అని విర్రవీగే కాంగ్రెస్ నా యకులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. స్వాతంత్య్రం ఇ చ్చింది బ్రిటిష్ వాళ్ళని ఒప్పుకుంటే తెలంగాణ ఇచ్చిం ది కాంగ్రెస్‌వాళ్ళని మేము ఒప్పుకుంటాం… మీకు ద మ్ము, ధైర్యం ఉందా? కేసిఆర్ అలుపెరుగని ఉద్య మంతో దేశం దిగివచ్చి తెలంగాణ ఇస్తే… దాన్ని మీ ఖాతాలో వేసుకుందాం అంటే ఎట్లా ? స్వాతంత్య్రం తెచ్చింది గాంధీజీ అంటారు.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటారు.. ఇదిఎక్కడిచోద్యం? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌అయితే స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటష్ వాళ్లని మీరు ఒప్పుకుంటారా? అని కాంగ్రెస్ వాళ్ల కు సవాల్‌విసిరారు. బుధవారం మండలంలోని గుం టూరుపల్లి, కాపులకనపర్తి, గవిచర్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగెం మండలా నికి నాకు విడదీయరాని బంధం ఏర్పడిందని, ఎల్లవే ళలా గుర్తుపెట్టుకుని అభివృద్ధి చేయడానికి చల్లా ధ ర్మారెడ్డికి తోడుగా ఉంటానన్నారు. గ్రామాల్లో కాంగ్రె స్ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఎంతో అవమా నం జరిగిందని, తెలంగాణ వచ్చినంక వాళ్లను గౌరవి స్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ గౌరవంగా జీవన విధానానికి నాంది పలికామన్నారు. బీఆర్‌ఎస్ అనేక సంక్షేమ పథకాలతో రైతును రాజును చేశామని అన్నా రు. కారుకూతలు కూసే కాంగ్రెస్ నాయకులారా ప్రజల బాగోగులు చూడకుండా 60 ఏళ్ల పాలనలో ఒకరుజుట్టు పట్టుకొని ఒక రు తన్నుకున్నారే తప్ప రా ష్ట్ర అభివృద్ధిని భ్రష్టు పట్టిం చారని అన్నారు.ఇప్పుడొ చ్చి ఇదిచేస్తాం అదిచేస్తా మని కల్లబొల్లి మాటలు చె ప్తూ మోసం చేయడానికి వస్తున్నారని తస్మాత్ జాగ్ర త్త అని ప్రజలను హెచ్చ రించారు. ఈ సందర్భంగా ఎమ్మెలే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి ద యన్న సహకారంతో మండలంలోని గ్రామాలకు రో డ్లు వేసుకోవడం వల్ల భూముల ధరలు ఆకాశాన్ని తాకాయని అన్నారు. కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ గ్రామాలలో పం చాయితీ కార్యాలయాల నిర్మాణాన్ని చూస్తే అబ్బుర ప డేవిధంగా ఉన్నాయని కితాబిచ్చారు.సంక్షేమ పథకా లు ప్రజలకు చేరవేయడం మాబాధ్యతన్నారు. పర్యట నలో భాగంగా గుంటూరుపల్లిలో రూ.3.10 కోట్లతో సీసీరోడ్లు,మహిళాభవనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతివనం, క్రీడా ప్రాంగణం ప్రారంభిం చి పంటనష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. కా పులకనపర్తిలో గ్రామపంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవం, రైతువేదిక, స్మశానవాటిక, పల్లె ప్ర కృతి వనం, గ్రామంలోని అంతర్గత సిసి రోడ్లు,బిటి రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. గవిచర్ల గ్రామంలో రూ.14కోట్లతో అభివృద్ధిపనుల శంకుస్థాపన లో భా గంగా సబ్‌స్టేషన్,సిసి రోడ్లు,గవిచర్ల నుండి కొత్తగూ డెం వరకు రోడ్డుశంకుస్థాపన చేశారు. గ్రామపంచా యతీ భవనాన్ని,మహిళా భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌చైర్మన్ నిమ్మగడ్డ వెంకటే శ్వర్‌రావు, స్థానిక సర్పంచులు మోతే శ్రీను రాజేశ్వరి, ఎర్రబెల్లి గోపాలరావు,దొనికెల రమా శ్రీని వాస్, ఎం పీపీ కందగట్ల కళావతి నరహరి, జడ్పిటిసి గూడ సు దర్శన్‌రెడ్డి, డిఆర్డిఓ సంపత్‌రావు, జిల్లా, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పూలుగు సాగర్‌రెడ్డి, బాబు, ఎంపీటీసీలు సుతారి బాలకృష్ణ, గూడ సంప త్‌రెడ్డి,తహసీల్దార్ రాజ్‌కుమార్,ఎంపీడీఓ వెంకటేశ్వ రరావు,సర్పంచులు, ఎంపీటీసీలు జి ల్లా అధికారులు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు, రైతుబంధు కన్వీనర్లు, యూత్ నాయకులు,రైతులు పాల్గొన్నారు.