కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావు అరెస్టు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసు విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలంటూ కల్వకుంట్ల కన్నారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. రాజకీయ కక్షలతో చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్న పిటిషనర్‌ వాదనను కోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగిం చాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Spread the love