మేరు కులస్తులకు బీసీ ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలి: కీర్తి రాజు

నవతెలంగాణ-గోవిందరావుపేట
మేరు కులస్తులకు ప్రభుత్వము బిసి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మేరు కుల సంఘం మండల అధ్యక్షులు కీర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో మెరు సంఘం నూతన మండల కమిటీ ని ఉమ్మడి వరంగల్ జిల్లా అడక్కంటి కన్వీనర్ తాళ్ల సంపత్ కుమార్ సూచన మేరకు నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములుగు జిల్లా ఎన్నికల కన్వీనర్ గూడూరు బాలాజీ మేరు, ఎన్నికల అధికారి, వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్ పెండ్యాల  హరి ప్రసాద్ మేరు, ఎన్నికల పరిశీలకులు గట్ల నాగేశ్వరరావు మేరు లు మేరు సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన మండల కమిటీని ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన మండల మేరు సంఘం కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. మండల మేరు సంఘం ( 2023-2026 )  కమిటీ అధ్యక్షుడు గా కీర్తి రాజు మేరు,  ప్రధాన కార్యదర్శి గా సంఘ సురేందర మూర్తి మేరు, కోశాధికారి గా కొండ విజయ్  మేరు , ఉపాధ్యక్షులు గా గూడూరు రమేష్, గూడూరు సుధాకర్, కొండ సత్యనారాయణ, గూడూరు వెంకటస్వామి, రాయబారపు రవి   కార్యదర్శులుగా కొట్టూరు దయానందం, గట్ల యాదగిరి, గట్ల వెంకటేశ్వర్లు, గట్ల సంధ్య వర్, గూడూరు చంద్రమౌళి నిర్వాహన కార్యదర్శులు గా గట్ల రాజు, గూడూరు మల్లయ్య, గూడూరు చంద్రమౌళి, పొడిషేట్టి ప్రసాద్, గూడూరు పవన్ కుమార్, పొడి శెట్టి సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మేరు సంఘం నూతన అధ్యక్షులు కీర్తి రాజు మాట్లాడుతూ మేరు కులస్తులు తమ కుల వృత్తి అయిన టైలర్ పని పై ఆధారపడి పేదరికం లో జీవిస్తున్నారని,కాబట్టి ప్రభుత్వం మేరు ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలని,   తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఇవ్వబోతున్న ఒక లక్ష రూపాయల బీసీ ఆర్థిక సహాయాన్ని గోవిందరావుపేట మండలంలో  దరఖాస్తు చేసుకున్న  మేరు కులస్తులందరికి ఇవ్వాలని తెలంగాణ  ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఇతర బీసీ కులాలకు ఇచ్చిన విదంగానే 50 సంవత్సరాలు వయసు ఉన్న మేరు కులస్తులకు  ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని, ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని,ప్రభుత్వ  స్కూల్స్ లలో  యూనిఫామ్ కుట్టు పనిని స్థానిక మేరు సంఘాలకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.
Spread the love