బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌

బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌న్యూఢిల్లీ : బెయిల్‌ మంజూరు కోసం సుప్రీంకోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆశ్రయించారు. తన బెయిల్‌ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిస్కరించడాన్ని, సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని హైకోర్టు సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ పిటీషన్‌ వేశారు. ఈ విషయాన్ని ఆప్‌ సోమవారం వెల్లడించింది. ‘హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీకి సంబంధించి ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ మంజారు చేసింది’ అని ఆప్‌ తన ప్రకటనలో తెలిపింది. మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు గత నెలలో సమర్థించింది. అలాగే కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటీషన్‌ను తిరస్కరించింది. అయితే ట్రయిల్‌ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను ఇచ్చింది.

Spread the love