జిల్లా గోసంగి సంఘం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
జిల్లా గోసంగి సంఘం జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుని తిరుగుతున్న నిజామాబాద్ రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిచరణ్ అనే వ్యక్తి సంఘంలో చేరికలు అంటూ ఖండువాలు వేయడం పట్ల జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు గంధం రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో జిల్లా గోసంగి సంఘం భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్త ల వద్దకు జిల్లా గోసంగి సంఘం పేరుతో నిజామాబాద్ రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిచరణ్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా గోసంగి సంఘం అధ్యక్షుడిగా చెప్పుకొని ఖండువాలు వేయడం పట్ల గోసంగి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి జిల్లా గోసంగి సంఘం అనేది కొన్ని దశాబ్దాలుగా కుల సంక్షేమం కోసం పని చేస్తుందని, 1978 లో నిష్కర్మాయోగి సంత్ లక్ష్మణ్ గిరి మహారాజ్ చేత రిజిస్ట్రేషన్ జరిగిందని, గత సంవత్సరంలో జిల్లాలో ఉన్నటువంటి 60 వేల గోసంగి జనాభాతో కుల సంఘం ఎలక్షన్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా జిల్లా గోసంగి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అటువంటి సంఘం పేరుతో సాయికిరణ్ తప్పుడు ప్రచారం చేయడాన్ని గోసంగి కులస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు అని అన్నారు. జిల్లా గోసంగి సంఘానికి జాగృతి నాయకుడు మల్లెల సాయి చరణ్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆయన అసలు గోసంగి కులస్తుడే కాదని, గోశికే అనే బీసీ కులానికి చెందిన వారు గోసంగి కుల ధ్రువీకరణ పత్రం పొందుతున్నారని, వాళ్లపై త్వరలో ఎస్సి కమిషన్ ను కలిసి కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయిస్తామని అన్నారు. జిల్లా గోసంగి సంఘం పేరుతో చేసిన తప్పుడు ఆరోపణలపై సాయిచరణ్, గోసంగి ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోసంగి ఉద్యోగుల సంఘం (గేవా) జిల్లా అధ్యక్షులు ఈర్నాల లక్ష్మణ్, జిల్లా నాయకులు వెంకటరమణ, కళ్లెం గంగాధర్, కొండపల్లి రమేష్, పవన్, గంగాధర్, బాల్కొండ మండల అధ్యక్షులు పస్థం లింగస్వామి, హనుమంతు, రాజన్న తదితులు పాల్గొన్నారు.

Spread the love