ఖరీఫ్ సాగు ఖరారు..

– 24 వేల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా.
– పక్క ప్రణాళికతో ముందుకు వెళుతున్న వ్యవసాయ శాఖ
– విత్తనాలు,ఎరువులు సిద్ధం చేసేలా కసరత్తు
– జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్న సాగు పనులు
నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలం సాగుకు మండల వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతొంది.సీజన్ లో రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.గతంలో మండలంలో కొన్ని గ్రామాల్లో ఎరువుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ సారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగానే పక్క ప్రణాళికతో ముందుకెళ్ళుతొంది.ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్తాయిలోకి వెళ్లి విత్తనాల,ఎరువుల డీలర్ల వద్దకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు.సొసైటీల డీలర్ల వద్ద ఉన్న డిఎపి,యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల లభ్యతపై లెక్కలు వేశారు. సీజన్ ఆరంబానికి ముందుగానే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దిక్కులు దున్నుకోని సిద్ధం చేసుకున్నారు.సీజన్ ఆరంభంలో సరైన వర్షాలు కురిస్తే వెంటనే పత్తి విత్తనాలు పెట్టుకోవడంతోపాటుగా వరినార్లు పోసుకునేందుకు సిద్దవుతున్నారు.రైతుల అవసరాలకు అనుగుణంగా మండల వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించుకుంది.
పంటల సాగు అంచనా ఇలా..
మండలంలో మొత్తం 15 గ్రామపంచాయతీల పరిధిలో 22 రెవెన్యూ గ్రామాల్లో 24 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయునట్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వరి 160,00, పత్తి 3,500, మిర్చి 2,500,ఇతర పంటలు 15,00 ఎకరాల్లో సాగు చేయునట్లుగా అంచనా వేసినట్లుగా మండల వ్యవసాయ అధికారి ఏ.సుధాకర్ తెలిపారు.అదే విధంగా యూరియా,డిఎపి,కాంప్లెక్స్ ,ఎంవోపి తదితర  6,890 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అంచనా వేశారు.
Spread the love