కాంగ్రెస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి

 – సెస్ ఉద్యోగి రికార్డులకు నిప్పంటించాడు.
నవతెలంగాణ- సిరిసిల్ల :సెస్ లో అగ్ని ప్రమాదానికి కారణమైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని సెస్  కార్యాలయంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంపై సోమవారం కేకే మహేందర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అవినీతి చిట్టా బయటపడుతుందనే అగ్ని ప్రమాద డ్రామా అని, రేపో మాపో విజిలెన్స్ అధికారుల ఆడిటింగ్ నేపద్యంలో అగ్నిప్రమాదం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్.. అవినీతిని ప్రోత్సహిస్తున్నాడా? లేక అందులో భాగస్వామ్యమా? చెప్పాలన్నారు. అనేక ఏళ్లుగా ఇక్కడే సెస్ అపిసులో తిష్ట వేసిన ఓ ఉద్యోగి పనే అని, చైర్మన్ కు సంబంధం లేకుంటే ఆ ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టపాసులు కాల్చి వెళ్ళిన ఆ ఉద్యోగి స్థానికంగానే ఉన్నప్పటికీ గంటసేపైనా ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్భాటంగా ఇటీవల సెస్ లో బదిలీ లు చేస్తున్నానని చెప్పిన చైర్మన్ సంబంధిత ఉద్యోగిని బదిలీ చేసి అదే విభాగం ఆ ఉద్యోగికి ఎలా ఇన్చార్జ్ ఇస్తారని సెస్ చైర్మన్ కు చిత్తశుద్ధి ఉంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని అన్నారు. కేటీఆర్ ను మూడు సార్లు గెలిపించిన పాపానికి సిరిసిల్లను మపియల రాజ్యం చేశాడని, ఒకరేమో భూ మాఫియా, శాండ్ మాఫియా,ఒకరు చేనేత మాఫియా ఇంకొకరు, మాదక ద్రవ్యాల మాఫియా మరొకరిని అన్నారు. ఇంత మంది మాపియలను కేటీఆర్ దగ్గర పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నాడని, మళ్ళీ కేటీఆర్ ను గెలిపిస్తే అవినీతి అనకొండలు పెరిగి పెద్దవై సిరిసిల్లను ఆగం జేసుడు ఖాయమని అన్నారు.

Spread the love